ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఐదేళ్లలో జగన్ పాలనంతా అరాచకం- చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు' - Actor Prithviraj Fire on CM Jagan - ACTOR PRITHVIRAJ FIRE ON CM JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 5:34 PM IST

Actor Prithviraj Fire on CM Jagan: ఐదేళ్లలో జగన్ పాలన అంతా అరాచకమని, అందుకే రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ మెడలు వంచి వచ్చారని విమర్శలు చేశారు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్​ తీసుకొచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుగ్లక్ పరిపాలనకు నిదర్శనం జగన్ అయితే సుపరిపాలన అందించేది చంద్రబాబు అని కితాబిచ్చారు. రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే ముందుకు తీసుకుని వెళ్తారని చెప్పుకొచ్చారు. 

"ఐదేళ్లలో జగన్ పాలన అంతా అరాచకం. అందుకే రాష్ట్రంలో కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ మెడలు వంచి వచ్చారు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్​తో జగన్ సర్కార్ రైతుల జీవితాలతో ఆడుకుంటుంది.  తుగ్లక్ పరిపాలనకు నిదర్శనం జగన్ అయితే సుపరిపాలన అందించేది చంద్రబాబు." - పృథ్వీరాజ్, సినీ నటుడు

ABOUT THE AUTHOR

...view details