బాలిక అదృశ్యం ఘటనలో చర్యలు - ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు - Action Against nandyal Police - ACTION AGAINST NANDYAL POLICE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 17, 2024, 1:19 PM IST
Action Against Police on Girl Missing Case: నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక అదృశ్యం ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించారని పేర్కొంటూ నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్, ముచ్చుమర్రి ఎస్‌ఐ జయశేఖర్ను కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఐజీ విజయరావు హెచ్చరించారు.
Girl Missing Case: ఈ నెల ఏడో తేదీన పగిడ్యాల మండలంలో 9 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక తండ్రి ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు మైనర్ బాలురు ఆడుకుంటున్న బాలికకు మాయ మాటలు చెప్పి చాక్లెట్ ఇచ్చి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో బాలిక గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితులు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో ఈ ఘటనలో ఇంకా విస్తుపోయే అంశాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. దీనిపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.