ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఈఎస్‌ఐ కేసు - ఛార్జ్​షీట్​ వేసేందుకు గవర్నర్​ అనుమతి తప్పనిసరి - Achchennaidu ESI case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 8:57 PM IST

TDP Leader Achchennaidu ESI case: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కేసు​లో ఏసీబీ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్​ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విజయవాడ ఏసీబీ కోర్టు (ACB court ) లో నేడు విచారణ జరిపింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ఛార్జిషీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని న్యాయమూర్తి ఏసీబీ అధికారులకు తెలిపారు.  అపాయింటింగ్ అథారిటీ అనుమతి లేకుండా చార్జిషీట్ పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. గతంలో ఈ తరహా కేసుల్లో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయా అని ఏసీబీ తరపు న్యాయవాదులను కోర్టు ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈఎస్ఐ ఔషధాల కొనుగోలులో అవతవకలు జరిగాయనే ఆరోపణలతో గతంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి పై ఏసీబీ కేసు నమోదు చేసింది.   

ABOUT THE AUTHOR

...view details