ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : దిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు - ప్రత్యక్ష ప్రసారం - 76TH REPUBLIC DAY IN DELHI LIVE

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 10:12 AM IST

Updated : Jan 26, 2025, 12:30 PM IST

Republic Day Celebrations in Delhi Live : గణతంత్ర వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంతో పాల్గొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణిమ్ భారత్‌, విరాసత్‌ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు.ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జాతీయ యుద్ధ స్మారకం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణమంత్రి, త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ తదితరులు నివాళులర్పించారు. అనంతరం కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఇండోనేసియా అధ్యక్షుడు సంప్రదాయ గుర్రపుబగ్గీలో కర్తవ్యపథ్‌ చేరుకున్నారు. తొలుత జాతీయజెండాను ఆవిష్కరించారు. పదిన్నరకు గణతంత్ర దినోత్సవ కవాతు ప్రారంభమైంది. అందులో ఇండోనేసియా సైనికులు కూడా పాల్గొన్నారు. 190మంది మిలిటరీ బ్యాండ్‌, 152మంది మార్చ్‌ఫాస్ట్ చేస్తున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లు పూర్తయిన వేళ స్వర్ణిమ్ భారత్‌, విరాసత్‌ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. 16 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్రప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు ఈ పరేడ్‌లో పాలన్నారు. ఈ సందర్భంగా భారత్‌ తన సైనికశక్తిని ప్రపంచానికి చాటింది. గణతంత్ర వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Last Updated : Jan 26, 2025, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details