ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'సూపర్ సిక్స్' ఎఫెక్ట్ టీడీపీలోకి భారీగా చేరికలు - సీఎం సొంత జిల్లాలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో వైఎస్సార్సీపీ నుంచి వలసలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 12:49 PM IST

300 Families Join TDP in Kadapa: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలస బాటపట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సీఎం జగన్‌ సొంత జిల్లా కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలానికి చెందిన 300 కుటుంబాలు వైఎస్సార్సీపీను వీడి టీడీపీలో చేరాయి. చెన్నూరులో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
TDP Vice President Putta Narasimha Reddy Invited Them into Party: ఈ కార్యక్రమంలో పుత్త నరసింహారెడ్డితో పాటు టీడీపీ జిల్లా యువ నాయకులు లక్ష్మిరెడ్డి, కృష్ణ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. తనను, పార్టీని నమ్మి వచ్చిన ప్రతి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటామని నరసింహారెడ్డి తెలిపారు. మాజీ సర్పంచ్ రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడమే తమ లక్ష్యమని, భవిష్యత్తులో వందల కుటుంబాలు చేర్పిస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details