Pinnelli Ramakrishna Reddy in Nellore Central Jail: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్‌కు తరలించారు. మాచర్లలో తెలుగుదేశం ఏజెంట్‌పై హత్యాయత్నం తోపాటు, కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పటిష్ట భద్రత మధ్య మాచర్ల నుంచి నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.
పిన్నెల్లిని నెల్లూరుకు తీసుకురావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు జైలు వద్దకు వచ్చే అవకాశం ఉందని అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయితే పిన్నెల్లి అనుచరులు కొంత మంది మాత్రమే జైలు వద్దకు వచ్చారు. జైలు వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ శ్రేణులు లోపలికి రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక ఎస్కార్ట్‌తో వచ్చిన పిన్నెల్లి నేరుగా జైలులోకి వెళ్లారు.
రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్ - నెల్లూరు జైలుకు తరలింపు - Pinnelli Ramakrishna Reddy remanded
కాగా ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు, అల్లర్ల కేసులో అరెస్టైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన 4 కేసుల్లో విచారణ చేపట్టారు. రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కాగా, మరో రెండు కేసుల్లో పిన్నెల్లికి రిమాండ్ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్ట భద్రత మధ్య ఆయన్ను నెల్లూరు జైలుకి తరలించారు.
అనుచరులతో కలిసి విధ్వంసం:వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు, అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌పైనా దాడి చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపైనా దాడికి యత్నించారు. పోలింగ్ తర్వాత రోజు సైతం అనుచరులతో కలిసి విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి చేశారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి సోదరులతోపాటు అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి.
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించే ఎవరికైనా శిక్ష తప్పదు- పిన్నెల్లి అరెస్టుపై ఎన్నికల సంఘం - ECI on Pinnelli Arrest
ఆ రెండు కేసుల్లో రిమాండ్:ఈ నాలుగు కేసుల్లో అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి గత కొన్నిరోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగా, ఇప్పటికే మూడుసార్లు వాటిని పొడిగించారు. తాజాగా ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మాచర్ల కోర్టుకు తరలించారు. దీంతో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి రిమాండ్ విధించారు.