అక్రమాలలో ఈ 'అన్న'కు పోటీ ఎవరూ లేరు! - అనుచరులను అడ్డుపెట్టుకుని భారీగా దోపిడీ YSRCP LEADER IRREGULARITIES: జగనన్న కాలనీలు పేదప్రజలకు ఏమాత్రం మేలు చేశాయో లేదో తెలియదు కానీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మాత్రం కాసులు కురిపించాయి. వాగులు, వంకలు, కొండలు, గుట్టల్లో తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, అవే భూములు ప్రభుత్వానికి 3, 4 రెట్లు అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇదే కోవలో గుంటూరు జిల్లాలోని కృష్ణాడెల్టాలోని కీలక ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి దాదాపు రూ. 80 కోట్ల వరకు వెనకేసుకున్నారు. పట్టణానికి దూరంగా ఉన్న ప్రాంతంలో అనుచరులతో ఎకరం రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల చొప్పున 60 ఎకరాలు కొనుగోలు చేసిన నేత, వాటినే ప్రభుత్వానికి రూ. 60 లక్షల చొప్పున విక్రయించారు.
మరోవైపు తాను సూచించిన రైతుల నుంచే మిగతా భూసేకరణ చేసేలా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అలా వారి నుంచి ఎకరాకు రూ. 15 లక్షల చొప్పున మరో రూ. 45 కోట్లు దండుకున్నారు. గుంటూరు జిల్లాలో భూసేకరణకు ప్రభుత్వం చెల్లించిన మొత్తం సొమ్ములో సగం ఈ ఒక్క నియోజకవర్గానికే కేటాయించారంటే, దందా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా సదరు నేత ముఖ్యమంత్రికి స్నేహితుడని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సీఎం ఈ నేతను తన స్నేహితుడిగానే పరిచయం చేశారు.
కొండలకు 'కన్నా'లు వేసే 'బాబు' - వసూళ్లలో రా'రాజు' - కాదంటే గన్ను గురిపెట్టి - YSRCP LEADER IRREGULARITIES
రూ. 50 కోట్ల విలువైన బుసక కొల్లగొట్టి: తక్కువ ధరకు వస్తున్నాయని లోతట్టు ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన ఆ ప్రజాప్రతినిధి అధిక ధరకు ప్రభుత్వానికి విక్రయించారు. ఇప్పుడు ఆ భూముల్లో ఇళ్లు నిర్మించడం కష్టమంటూ చదును పేరిట కోట్లు దండుకున్నారు. దీనికోసం ఉపాధిహామీ పథకం కింద రూ. 30 కోట్లకుపైగా నిధులు వెచ్చించారు. భవన నిర్మాణ వ్యర్థాలతో భూములు చదును చేసి, దూరప్రాంతం నుంచి మట్టి, ఇసుక తెచ్చినట్లు బిల్లులు పెట్టుకున్నారు. ఇలా చదును పేరుతోనూ రూ. 20 కోట్లు స్వాహా చేశారంటేనే ఆయన పనితనం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జగనన్న కాలనీల మెరకకు బుసక తవ్వకాలకు అనుమతి పొంది పెద్దఎ్తతున ఇతర ప్రాంతాలకు తరలించారు. మేనల్లుడు, వ్యక్తిగత సహాయకుడు ఈ దందాలో పాలుపంచుకున్నారు. దాదాపు రూ. 50 కోట్ల విలువైన బుసక కొల్లగొట్టారు.
అడ్డుకున్న వారిపైకి ట్రాక్టర్లు మీదకి ఎక్కించి:భారీ యంత్రాలతో ఇసుక తవ్వించి పరిమితికి మించి లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్న ఈ నేత వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. వారిపై జాలితలిచిన సదరు నేత, వారికో బంపర్ ఆఫర్ ఇచ్చారు. పెద్దపెద్ద వాహనాలను వదిలేసి చిన్నచిన్న ట్రాక్టర్లపై కావాలంటే కేసులు కట్టుకోండంటూ దయ చూపారు. భారీ వాహనాల్లో ఇసుక తరలింపుతో రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు రాస్తారోకోలు చేస్తే వారిపైనే తిరిగి కేసులు పెట్టించారు. వాహనాలను అడ్డుకున్న వారిపైకి ఏకంగా ఆయన అనుచరులు ట్రాక్టర్లు మీదకి ఎక్కించారు.
ఐదేళ్లలో రూ. వందల కోట్ల అక్రమార్జన - అవినీతి 'కాసు'లతో మల్టీప్లెక్స్ నిర్మాణం - YSRCP MLA Irregularities
హుకుం జారీ: ఈయన ప్రాతినిధ్య వహిస్తున్న పట్టణంలో ఇల్లు కట్టాలన్నా, వెంచర్ వేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, సదరు నేతకు కప్పం కట్టాల్సిందే. ఆయన అనుచరుడైన ఓ బిల్డర్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటాడు. ఓ సామాజికవర్గం వారు బహుళ అంతస్తుల సముదాయం నిర్మించుకుంంటుంటే, కోటి రూపాయలు డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వలేదని అధికారులను ఉసిగొల్పి శ్లాబ్‌ను ధ్వంసం చేయించారు. ఆయన అనుచరులూ నిర్మాణదారులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణదారులతో తమ వద్దే లాకింగ్ బ్రిక్స్ కొనుగోలు చేయాలని హుకుం జారీ చేశారు.
గంజాయి విక్రయాలు, కోడిపందేలు, జూదం: ఒప్పంద ఉద్యోగాలన్నీ తన అనుచరులకే ఇప్పించుకున్నారీ ప్రజాప్రతినిధి. వాళ్లేమో జీతం తీసుకుంటారు కానీ ఎప్పుడూ పనికిరారు. ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య పనుల కాంట్రాక్ట్ తన వారికి ఇప్పించుకునేందుకు అంతకు ముందు అక్కడ ఉన్నవారిపై పరుపులు తగలబెట్టారంటూ అక్రమ కేసు బనాయించిన ఘనత ఈ నేతది. ఆయనతో పాటు అనుచరులు సైతం ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. పురపాలక స్థలాల బహిరంగ వేలంలో గందరగోళం సృష్టించి తక్కువ ధరకే తన వారికి ఇప్పించుకున్నారు. రౌడీషీటర్లను ప్రోత్సహించి ప్రైవేట్ పంచాయితీలు నిర్వహిస్తున్నారు. గంజాయి విక్రయాలు, కోడిపందేలు, జూదం యథేచ్ఛగా సాగిస్తున్నారు. తన కళాశాలకు, తండ్రి సమాధి వరకు ప్రభుత్వ నిధులతోనే రోడ్లు వేయించుకున్నారు.
ప్రాసల నేత 'పైసా'చికత్వం - అ'ధర్మ' బాటలో వైఎస్సార్సీపీ నేత అరాచకాలు - YSRCP Leaders Irregularities