ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూహక్కు చట్టంపై నీతి ఆయోగ్‌ ఏం చెప్పింది ? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేసింది ? - YSRCP Govt Land Titling Act Reality

YSRCP Govt Land Titling Act Reality: వైఎస్సార్సీపీ సర్కార్ పౌరుల ఆస్తులకు ఎసరు పెట్టేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్​ను రూపొందించింది. నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. ప్రభుత్వ పెద్దలు మాత్రం అది కేంద్రం సూచించిన చట్టం, మాదేం తప్పులేదన్నట్లు ఊదరగొడుతున్నారు.

YSRCP_Govt_Land_Titling_Act_Reality
YSRCP_Govt_Land_Titling_Act_Reality (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 10:20 AM IST

YSRCP Govt Land Titling Act Reality:ల్యాండ్‌ టైటిలింగ్‌ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌ చేసిన కీలక సూచనలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. పౌరుల స్థిరాస్తులకు ఎసరు పెట్టేలా నచ్చిన విధంగా ఈ చట్టాన్ని రూపొందించుకుంది. ప్రభుత్వ పెద్దలు మాత్రం అది కేంద్రం సూచించిన చట్టం, మాదేం తప్పులేదన్నట్లు ఊదరగొడుతున్నారు.

నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిన నమూనా టైటిలింగ్‌ చట్టం, సీఎం జగన్‌ సర్కారు తెచ్చిన యాక్ట్‌ను పక్కన పెట్టుకొని అధ్యయనం చేస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. దేశంలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని వైఎస్సార్సీపీ గర్వంగా చెబుతోంది. అలాంటప్పుడు నీతి ఆయోగ్‌ నమూనా చట్టం స్ఫూర్తికి ఎందుకు తూట్లు పొడిచారనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏమి సూచించింది. జగన్‌ ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని తెచ్చిందో పరిశీలిద్దాం.

క్రమ సంఖ్య నీతి ఆయోగ్‌ నమూనా టైటిలింగ్‌ చట్టం జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం
1 సెక్షన్‌ 5 ప్రకారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(టీఆర్‌వో)గా ఏ అధికారినైనా నియమించొచ్చు. సెక్షన్‌ 5 ప్రకారం టీఆర్‌వోగా ఏ వ్యక్తినైనా నియమించొచ్చు. ఇందులోనే కుట్ర కోణముంది.
2 టైటిల్‌ వివాదం ఉన్నట్లు టీఆర్‌వో గుర్తిస్తే సెక్షన్‌ 10 కింద వివాదాల రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేసి ల్యాండ్‌ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ ఆఫీసర్‌(ఎల్‌డీఆర్‌వో) వద్దకు పంపాలి. ఇందులో ఎల్‌డీఆర్‌వో ప్రస్తావనే లేదు. ఆ నియమకానికి పాతరేశారు. నేరుగా ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ఆఫీసర్‌ని ఆశ్రయించాలని పేర్కొన్నారు.
3 ఎల్‌డీఆర్‌వో ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎల్‌టీఏటీ)ను ఆశ్రయించేందుకు సెక్షన్‌ 15 వెసులుబాటు ఇస్తుంది. సెక్షన్‌ 36 ప్రకారం ఈ ట్రైబ్యునళ్లకు జిల్లా జడ్జి ర్యాంక్‌ కలిగిన జ్యుడిషియల్‌ అధికారి లేదా విశ్రాంత జ్యుడిషియల్‌ అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుంది. న్యాయశాస్త్రం తెలిసిన జ్యుడిషియల్‌ అధికారితో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో అప్పీలేట్‌ ట్రైబ్యునళ్లను నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేయమంది. ఈ చట్టంలో సెక్షన్‌ 36ప్రకారం అప్పీలేట్‌ ట్రైబ్యునళ్ల ఊసేలేదు. ట్రైబ్యునళ్ల స్థానంలో ఆయా జిల్లా సంయుక్త కలెక్టర్‌ హోదాకు తగని అధికారిని లేదా విశ్రాంత అధికారిని ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ఆఫీసర్‌ (ఎల్‌టీఏవో)గా నియమించారు. అప్పీలేట్‌ ట్రైబ్యునళ్లకు పాతరేసి సంయుక్త కలెక్టర్‌ స్థాయిలో అప్పీలేట్‌ అధికారిని మాత్రమే నియమించుకునేందు వీలు కల్పించారు.
4 రికార్డుల్లో యజమాని పేర్లను ఓసారి చేర్చి నోటిఫై చేశాక 'మూడేళ్ల' లోపు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విషయంలో ఈ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించొచ్చు. రికార్డుల్లో నమోదైన యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తంచేసే గడువును ఈ చట్టంలో 'రెండేళ్ల'కు(సెక్షన్‌ 13) కుదించారు. తర్వాత ఆ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించొచ్చు.
5 హైకోర్టులో 'అప్పీల్‌'కు అవకాశం ఇవ్వలేదు. సెక్షన్‌ 16 కింద కేవలం 'రివిజన్‌' మాత్రమే దాఖలు చేసుకోవాలి. హైకోర్టులో 'అప్పీల్‌'కు అవకాశం ఇవ్వలేదు. సెక్షన్‌ 16 కింద కేవలం 'రివిజన్‌' మాత్రమే దాఖలు చేసుకోవాలి.
6 ఈ చట్టం ద్వారా వివాదం పరిష్కరించుకునేందుకు కేవలం రెండంచెల వ్యవస్థకే పరిమితం చేశారు. టీఆర్‌వో తర్వాత 1. ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ అధికారి/సంయుక్త కలెక్టర్‌. 2. హైకోర్టులో రివిజన్‌కు అవకాశం కల్పించారు. ఈ చట్టం ద్వారా వివాదం పరిష్కరించుకునేందుకు కేవలం రెండంచెల వ్యవస్థకే పరిమితం చేశారు. టీఆర్‌వో తర్వాత 1. ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ అధికారి/సంయుక్త కలెక్టర్‌. 2. హైకోర్టులో రివిజన్‌కు అవకాశం కల్పించారు.
7 ఈ చట్టంలో 'అథారిటీ'కి తప్పుడు సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా 'అధికారులే' సంబంధిత వ్యక్తికి 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50వేల జరిమానా లేదా రెండింటినీ విధించొచ్చు. ఈ చట్టంలో 'అథారిటీ'కి తప్పుడు సమాచారం ఇచ్చినా, ఇవ్వకపోయినా 'అధికారులే' సంబంధిత వ్యక్తికి 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50వేల జరిమానా లేదా రెండింటినీ విధించొచ్చు.

"ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అత్యంత దుర్మార్గమైన చట్టం. ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను అధికారంలో ఉన్నవాళ్లు కొట్టేయడానికి అనువుగా దీన్ని తెచ్చారు. నీతి ఆయోగ్‌ సూచించిన ఆంశాలను తీసేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాళ్లకు అనుకూలంగా జోడించుకొని ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలి.'' - సీనియర్‌ న్యాయవాది నీలం రామమోహన్‌రావు, టైటిలింగ్‌ యాక్ట్‌పై గుంటూరు జిల్లా కార్యక్రమాల సమన్వయకర్త

జగన్​ భూ దాహానికి ముసుగు ​చట్టం - ఆ లక్షల ఎకరాలు ఎవరి ఖాతాలోకి? - AP LAND TITLING ACT 2023

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో వారికి ఇబ్బందే - చట్టంలో తీవ్రమైన లోపం: విశ్రాంత న్యాయమూర్తి - former CJ on land titling act

ABOUT THE AUTHOR

...view details