YSRCP Govt Neglected Sports Development :వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లూ క్రీడాభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసింది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of Andhra Pradesh) ఆధ్వర్యంలోని క్రీడా మైదానాలను ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించింది. నిత్యం సాధన కోసం మైదానాలకు వచ్చే క్రీడాకారులకు నిరుత్సాహమే మిగులుతోంది.
ఏలూరు జిల్లాలో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని క్రీడా మైదానాలు కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. కొత్త మైదానాలు ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటి నిర్వహణకు వైఎస్సార్సీపీ పాలకులు పూర్తిగా నీళ్లొదిలేశారు. రన్నింగ్, వాకింగ్ ట్రాకుల మొదలు మరుగుదొడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు సదుపాయాలు సవ్యంగా లేకుండా చేశారు. ఇండోర్ స్టేడియం, ఏఎస్ఐర్ స్టేడియం (Alluri Seetarama Raju Stadium), ఈతకొలను ఉండగా 3 చోట్ల ఉన్న వ్యాయామశాలల్లోని పరికరాలు పూర్తిగా పాడయ్యాయి.
15 ఏళ్ల క్రితం వచ్చినవి కావడం, మరమ్మతులకు గత జగన్ ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో క్రీడాకారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వ్యాయామశాల పరికరాలు చాలావరకు మరమ్మతులకు గురికాగా అవి క్రీడాకారులకు సమస్యగా మారింది. భవనం కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయి కనిపిస్తున్నాయి. ఉన్న వాటితోనే క్రీడాకారులు నెట్టుకొస్తున్నారు.
విశాఖ ప్రజలకు గుడ్న్యూస్ - మెట్రో ప్రాజెక్టు మొదటి దశ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం