YSRCP Decision Not to Come Legislative Assembly:రేపు శాసన సభకు రాకూడదని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. శాసన సభాపతి ఎన్నికకు దూరంగా ఉండాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. సాంప్రదాయం ప్రకారం సభాపతి ఎన్నికలో విపక్షాలు పాల్గొనాల్సి ఉంది. ఎన్నికైన సభాపతిని విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. ఎప్పట్నుంచో వస్తోన్న ఈ సాంప్రదాయాలను జగన్ దూరంగా పెట్టారు. రేపు సభాపతి ఎన్నిక ఉన్నప్పటికీ జగన్ బహిష్కరిస్తూ వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు పులివెందులకు బయలు దేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వర్గాలు వైఎస్సార్సీపీ వెల్లడించాయి.
మెదటి రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ వెనుక గేటు నుంచి చేరుకున్నారు. గతంలో సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వెళ్లేవారు. తరచూ వెళ్లే అమరావతి రైతులు శిబిరం వైపు కాకుండా వెనుకవైపు నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. రాజధాని రైతులు ఎక్కడ నిరసన తెలుపుతారనే భయంతోనో ఏమో గాని మందడం గ్రామం మీదుగా అయన వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిముషాల తర్వాత వచ్చిన అయన అసెంబ్లీలోకి వెళ్లలేదు.
తొలిరోజు సందడిగా శాసన సభ- చంద్రబాబు, పవన్, జగన్ ఎలా స్పందించారంటే! - AP Assembly Sessions 2024
గత ప్రభుత్వంలో కొనసాగిన ఉపసభాపతి ఛాంబర్‌లోనే జగన్, తన పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు. ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేసి, ప్రొటెం స్పీకర్‌కు అభినందనలు తెలిపి సభలో కూర్చోకుండా తిరిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేటప్పుడు తన పేరు చెప్పడంలో జగన్ తడబడ్డారు. వైఎస్ జగన్ మోహన్ అనే నేను అని తొలుత పలికిన ఆయన తడబాటు తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం కొనసాగించారు.
మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం:మంత్రుల తర్వాత నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత ప్రమాణం చేయాలి. ఎన్నికల్లో ఘోర ఓటమితో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. ఫలితంగా ఆయన కూడా మహిళా శాసనసభ్యుల తర్వాత మిగిలిన సభ్యుల మాదిరిగానే ప్రమాణస్వీకారం చేయాల్సి వచ్చింది. అయితే సీఎం చంద్రబాబు ఈ విషయంలో హుందాతనంగా ప్రవర్తించారు. మంత్రుల తర్వాత జగన్‌ను ప్రమాణస్వీకారానికి పిలవాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌కు సూచించారు. దీంతో మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం చేశారు.
అసెంబ్లీలో తడబడిన జగన్ రెడ్డి- 'ఘోరఓటమి తరువాత ఇదే తొలిసారి - pulivendula mla ys jagan oath
అసెంబ్లీకి చంద్రబాబు- భువనేశ్వరి ఎలా స్పందించారంటే! - Bhuvaneshwari in CBN Assembly Video