YS Sunitha Fire Cm Jagan :ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చని పదేపదే చేయలేరనే విషయాన్ని గ్రహించాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు. వైఎస్ షర్మిల, తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని గుర్తు చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు. ప్రజలంతా గ్రహిస్తున్నారని, వాస్తవాలేంటో వారికి తెలుసని అన్నారు. హైదరాబాద్, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్‌కు సునీత మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ఎమోషన్ మాటలతో ప్రతిసారీ అందర్నీ మోసం చేయలేరని ఎద్దేవా చేశారు.
సాక్షి ఛానల్‌కు వస్తా - డిబేట్ చేద్దాం :వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలనిసునీత డిమాండ్ చేశారు. వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసనిజగన్ అన్నారని సునీత గుర్తు చేశారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో జగన్ కూడా ఒకరు కదా! అలాంటప్పుడు హత్య ఎవరు చేశారో ఎవరు చేయించారో జగన్‌కు తెలిసినట్లే కదా! అని అన్నారు. అది ఎందుకు బయటపెట్టడం లేదని తెలిపారు. చెప్పాల్సిన బాధ్యత సీఎంగా జగన్‌పై ఉందని అన్నారు.
జగన్ బంధుత్వాలకు అర్థం తెలుసా? చంపిన వాళ్లు నీ పక్కనే ఉన్నారు- వైఎస్ సునీత - ys viveka murder case
అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. అవినాష్‌ను అరెస్టు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని భయమా? అంటూ ప్రశ్నించారు. జగన్ ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థంచేసుకోవాలని, తనతో నేరుగా మాట్లాడాలంటే సాక్షి ఛానల్‌కే వస్తా ధైర్యంగా మాట్లాడదామని ఛాలెంజ్ చేశారు. తనకు అభ్యంతరం లేదని సాక్షి ఛానల్‌కు తానే వస్తానని, డిబేట్ చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. ఎవరేం చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు.