YS SHARMILA ELECTION CAMPAIGN: జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాను మరచిపోయారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ సీఎంకు తెలియదా అంటూ నిలదీశారు. ఐదేళ్లు అయ్యిందని, ప్రత్యేక హోదా ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి:రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించట్లేదని షర్మిల విమర్శించారు. మూడు రాజధానులన్నారని, ఒక్కటీ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సరైన వ్యక్తికి వేయాలని షర్మిల పిలుపునిచ్చారు.
చెల్లి చీరపై సీఎం సెటైర్లు - జగన్ రెడ్డికి సంస్కారం ఉందా? షర్మిల ఫైర్ - YS Jagan Fire On YS Sharmila
జాబ్ క్యాలెండర్ ఏమైంది:జగన్‌ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారన్న షర్మిల, జగన్ పాలనలో రైతులంతా అప్పులపాలయ్యారని దుయ్యబట్టారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారని, ఏమైందని షర్మిల ప్రశ్నించారు. ఒక్క ఏడాదైనా రైతుల కోసం 3 వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టారా అని నిలదీశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదని, సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ అన్నారు ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లు ఉద్యోగాలివ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా - జగన్పై మండిపడ్డ షర్మిల కుంభకర్ణుడైనా 6 నెలలకు లేస్తారు: ఐదు సంక్రాంతిలొచ్చాయని, జాబ్ క్యాలెండర్ లేదని, కోడిపందేలు మాత్రం జరిగాయని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా అంటూ మండిపడ్డారు. కుంభకర్ణుడైనా 6 నెలలకు లేస్తారని, జగన్ ప్రభుత్వం ఎందుకు మేల్కోలేదని అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుంటే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని, ఇప్పుడు సిద్ధమంటూ వస్తున్నారెందుకని, ఓడిపోవడానికి సిద్ధమేమో అంటూ ప్రశ్నించారు.
సర్కారే మద్యం అమ్ముతోంది: అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మద్యపానం నిషేధమన్నారు, తీరా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతోందని ధ్వజమెత్తారు. నాసిరకం మద్యం తాగి కిడ్నీలు పాడైపోయి చనిపోతున్నారని విమర్శించారు. బటన్ నొక్కి ఇచ్చేదెంత అని నిలదీసిన షర్మిల, వైసీపీ హయాంలో 100 రూపాయలు ఇచ్చి రూ.1000 లాక్కుంటున్నారని షర్మిల మండిపడ్డారు.
వైఎస్ పేరును సీబీఐ చార్జీషీట్లో చేర్పించింది జగనే: షర్మిల - YS Sharmila on CM Jagan