YS Sharmila criticized CM Jagan:బొత్స సత్యనారాయణ జగన్‌కి తండ్రి సమానులు అంట అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవాచేశారు. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్సార్‌ను తిట్టిపోసిన వ్యక్తి అని ఆమె అన్నారు. ఇదే బొత్స వైఎస్సార్‌ను తాగుబోతు అని తిట్టాడు, ఇదే బొత్స జగన్‌కు ఉరి శిక్ష వేయాలని అన్నాడని అన్నారు. జగన్మోహన్రెడ్డి బినామీలు అన్నాడని అన్నారు. విజయమ్మను సైతం అవమాన పరిచాడన్న షర్మిల, ఇలాంటి బొత్స జగన్ కి తండ్రి సమానులు అయ్యారని విమర్శించారు.
జగన్ క్యాబినెట్లో ఉన్న వాళ్లు అందరు వైఎస్ఆర్ను తిట్టిన వాళ్లేనని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్‌ను తిట్టిన వాళ్లకే జగన్ పెద్దపీట వేశారని విమర్శించారు. వీళ్లందరూ తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు అని అన్న షర్మిల, నిజంగా ఆయన కోసం పని చేసిన వాళ్లు ఈయనకు ఏమీ కారని విమర్శించారు. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్లు ఏమి కారని ఎద్దేవా చేశారు. ఆయన కోసం పని చేసి గొడ్డలి పోటుకు గురైన వాళ్లు ఏమీ కారని అన్నారు. వైఎస్సార్సీపీ పేరులో వైఎస్సార్ లేడని అన్నారు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి, ఆర్ అంటే రామకృష్ణా రెడ్డి అని షర్మిల అన్నారు. గతంలో రాజశేఖరరెడ్డిని తిట్టిన రోజా, బొత్స సత్యనారాయణ, విడదల రజినీలను జగన్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
జగన్ ఏలుబడిలో అటకెక్కిన జలయజ్ఞం - సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం - NEGLIGENCE ON JALAYAGNAM