ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం షాపు కార్మికుల ఆత్మహత్యలకు సీఎం జగనే కారణం: ఇస్మాయిల్‌ ఖాన్‌ - మద్యం కార్మికుల సమస్యలు

YCP Government Not Solve Liquor workers Problems: రాష్ట్రంలో ఉన్న మద్యం షాపు కార్మికులను రోడ్డును పడేయడమే కాకుండా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సీఎం జగన్ కారణమని లిక్కర్ షాప్ వర్కర్స్ ఆరోపించారు. తమ గోడును సీఎంకు విన్నవించుకోవడానికి చలో విజయవాడ కార్యక్రమం పెడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి తమ సమస్యలు విన్నవించుకుంటే సానుకూలంగా స్పందించిందని తెలిపారు.

YCP Government Not Solve Liquor workers Problems
YCP Government Not Solve Liquor workers Problems

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 9:46 AM IST

YCP Government Not Solve Liquor Workers Problems:రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో పని చేస్తున్న 1,75,000 మందిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డున పడేసిందని లిక్కర్ షాప్ వర్కర్స్ యూనియన్ మండిపడింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్రస్థాయి లిక్కర్ షాప్ వర్కర్స్ సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై వర్కర్స్ గళమెత్తారు. మద్యం షాపు కార్మికులను రోడ్డును పడేయడమే కాకుండా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సీఎం జగన్ కారణమని ఆరోపించారు. తమ గోడును సీఎంకు విన్నవించుకోవడానికి చలో విజయవాడ కార్యక్రమం పెడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని లిక్కర్ షాప్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిడదవోలులో జరిగిన లిక్కర్ షాప్ వర్కర్స్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు, లిక్కర్ షాప్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్ ఖాన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఉన్న 26 జిల్లాల నుంచి ప్రతినిధులు అంతా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.

మద్యం మత్తులో రెండు భవనాల మధ్య ఇరుక్కున్న వ్యక్తి- స్థానికులు గమనించేలోగా ఘోరం

Liquor Shop Workers State Meeting at Nidadavolu: గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ ఖాన్ మాట్లాడుతూ బ్రాందీ షాపు కార్మికులను రోడ్డున పడేయడమే కాకుండా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కారణమయ్యారని ఆరోపించారు. చాలా మంది పడుకోలేని పరిస్థితి, పని చేయలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును సీఎంకు విన్నవించుకోవడానికి చలో విజయవాడ కార్యక్రమం చేపడితే తమని ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​లలో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాంలో లిక్కర్ షాప్ వర్కర్స్ సమస్యలను విన్నవించుకుంటే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎటువంటి నిబంధనలు లేకుండా ఉపాధి కల్పించడానికి చంద్రబాబు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

మద్యం షాపు కార్మికుల ఆత్మహత్యలకు సీఎం జగనే కారణం: ఇస్మాయిల్‌ ఖాన్‌

నివాసాల మధ్య మద్యం షాపు తొలగించాలని మహిళల నిరసన.. అరెస్ట్​

సీఎం జగన్ అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేస్తామని పాదయాత్రలో పేర్కొన్నారు. కానీ ఆ మాటలను గత నాలుగు సంవత్సరాలలో నెరవేర్చిందే లేదు. అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్న జగన్ ఇప్పుడు లిక్కర్ షాప్ వర్కర్స్ సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులు, ఆశా వర్కర్లు, ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో వారు నిరసన బాట పడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కన్నా సమస్యలే ఎక్కువ ఉన్నాయని పలు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

వైఎస్సార్సీపీ అయితే వదిలేస్తారా? - కర్ణాటక మద్యం తరలింపు కేసులో పోలీసుల ఉదాసీనత

ABOUT THE AUTHOR

...view details