ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగుల ఓట్ల కోసం డీఏల ఎర - పాత బకాయిలను గాలికి వదిలి ఓట్ల కోసం జగన్ నటన - Jagan DA bait for employees votes

YCP Govt Issued Orders Announcing Two DAs to Employees: ఈ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై కక్షగట్టిన జగన్ ఎన్నికల ముంగిట వారిని ప్రసన్నం చేసుకునేందుకు కొత్త ఎత్తులు వేశారు. పెండింగ్ బకాయిలు ఇవ్వాలని కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలు మొత్తుకున్నా కనీసం పట్టించుకోలేదు. ఇవాళ ఎన్నికల షెడ్యూలు విడుదల కానుండటంతో వారిని మభ్యపెట్టేందుకు రెండు డీఏలు ప్రకటిస్తూ ఆగమేఘాలపై శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి, జులై మాసాల్లో విడుదల చేయాల్సిన డీఏలను ఇప్పుడు ప్రకటించి ఉద్యోగులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు.

das_to_employees
das_to_employees

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 7:24 AM IST

ఉద్యోగుల ఓట్ల కోసం డీఏల ఎర - పాత బకాయిలను గాలికి వదిలి ఓట్ల కోసం జగన్ నటన

YCP Govt Issued Orders Announcing Two DAs to Employees:ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ డీఏల ఎర వేశారు. ఎన్నికల కోడ్‌కు ముందురోజు రాత్రికిరాత్రే రెండు పెండింగ్ డీఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అందులో కూడా తన మార్కు జిత్తులమారితనాన్నే ప్రదర్శించారు. తాజాగా ప్రకటించిన డీఏలతో ఇప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వంపై పడే భారం పెద్దగా లేదు. దాన్ని కొత్త ప్రభుత్వంపైకి నెట్టేశారు. జనవరి డీఏలను 2024 ఏప్రిల్‌ జీతంతో కలిపి మే నెలలో ఇస్తారు. ఈ లెక్కన ఈ ప్రభుత్వం చెల్లించేది ఇదొక్కటే. మిగతాదంతా కొత్త ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు చెల్లించాల్సిన బకాయిల్ని మూడు విడతల్లో 2024 ఆగస్టు, నవంబరు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పీఎఫ్‌, జీపీఎఫ్‌ ఖాతాల్లో జమచేస్తారు.

ప్రభుత్వ ఉద్యోగులతో జగన్‌ చెడుగుడు - జీతాల కోసం ప్రతి నెలా పడిగాపులే !

సీపీఎస్‌ ఉద్యోగులకు 90శాతం నగదు, మిగతా 10 శాతాన్ని ప్రాన్‌ ఖాతాలకు జమ చేయనున్నారు. పదవీవిరమణ చేసే ఉద్యోగులకు బకాయిల్ని రిటైర్మెంట్ ప్రయోజనాలతో కలిపి చెల్లిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 2023 జులై డీఏని ఈ ఏడాది జులై జీతంతో కలిపి ఆగస్టులో చెల్లిస్తారు. 2023 జులై నుంచి 2024 జూన్‌ 30 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని మూడు వాయిదాల్లో సెప్టెంబరు, డిసెంబరు, వచ్చే ఏడాది మార్చి నెలల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఆర్‌ ఉత్తర్వులను విడుదల చేయలేదు. వీరికి బకాయిల్ని నగదు రూపంలో చెల్లించాలి. ఇప్పటిదాకా పాత బకాయిలనే చెల్లించని సర్కార్ కొత్త వాటిపైనా స్పష్టత ఇవ్వలేదు.

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరితే విధుల నుంచి తొలగిస్తారా? : గురుకుల ఉద్యోగులు

జగన్‌ సర్కార్ ఒక్కో ఉద్యోగికి సగటున రెండున్నర లక్షల రూపాయలకుపైగా ఇప్పటికీ బకాయి ఉంది. 2022 జులైలో డీఏ మంజూరు ఉత్తర్వులిచ్చినా ఇంతవరకూ ఆ ప్రయోజనాలు అందలేదు. 2018 జులై, 2019 జనవరి డీఏలకు సంబంధించిన దాదాపుగా 66 నెలల బకాయిల్ని చాలామంది ఉద్యోగులకు చెల్లించాలి. సాంకేతికంగా ఇచ్చేసినట్టు చూపించి ఉద్యోగుల నుంచి ఆదాయపన్నును మినహాయించారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

అరకొర జీతం, అదీ మూడు నెలలకు గానీ రాదు - ఆర్​బీకే ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు

2019 జులై, 2020 జనవరి, జులై, 2021 జనవరి, జులై డీఏలను 2022 జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపి జీతాలు భారీగా పెరిగినట్టు వైసీపీ ప్రభుత్వం చూపించింది. కానీ వాటికి సంబంధించిన 54 నెలల బకాయిలను ఇవ్వలేదు. సీపీఎస్‌ ఉద్యోగులు, పింఛనుదారులకు నగదు రూపంలో చెల్లించాల్సిన డీఏ బకాయిలు 2 వేల 100 కోట్లు ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల డీఏ బకాయిలు పెట్టి ఇప్పుడు ఎన్నికల కోడ్‌కు ఒకరోజు ముందు ఉద్యోగులను మోసం చేసేందుకు 2023 జనవరి డీఏ 3.64శాతం, జులై డీఏ 3.64శాతం రెండు డీఏలు విడుదల చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details