ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు భాషను మరిస్తే అమ్మను మరిచినట్టే: వెంకయ్యనాయుడు - WORLD TELUGU CONFERENCE

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు - తెలుగు మహాసభలకు హాజరైన పలువురు రచయితలు, కవులు

WORLD_TELUGU_MAHASBHALU
WORLD_TELUGU_MAHASBHALU (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 3:59 PM IST

World Telugu Conference in Godavari Global University:తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు భాషలో పరిపాలన అందించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని అలానే తెలుగు మాట్లాడని నాయకుడుకి ఓటు వేయొద్దని చెప్పారు. బూతులు మాట్లాడే నాయకుల్ని పోలింగ్​ బూత్​లోనే మట్టు బెట్టాలని అన్నారు.

అమ్మ భాషను మరిస్తే అమ్మను మరిచినట్టేనని అన్నారు. తెలుగులో మాట్లాడని వారు తెలుగు నాయకుడు కాదని అన్నారు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, అండమాన్ నికోబార్ దీవుల్లో అద్భుతంగా తెలుగు మాట్లాడేవారు ఉన్నారని వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్టీఆర్, నార్ల వెంకటేశ్వరరావు, రామోజీరావు తెలుగు భాషకి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇంగ్లీషులో 2 లక్షల పదాలు ఉంటే తెలుగులో 6 లక్షల పదాలు ఉన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. అమ్మ భాషను మరవద్దని వెంకయ్య పిలుపునిచ్చారు.

'సంక్రాంతికి వస్తున్నాం' - 'ఓ సామాన్యుడి స్టోరీ' చదివేయండి!

డిగ్రీ వరకు ప్రథమ భాషగా తెలుగు ఉండాలి:పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ వ్యవస్థలను మూసివేయాలని ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) అన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమమే ఉండాలని చెప్పారు. డిగ్రీ వరకు ప్రథమ భాషగా తెలుగు ఉండాలని అన్నారు. 2 నెలల క్రితం సీఎం చంద్రబాబు ఫోన్‌ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి స్వీకరించాలని కోరారని గరికపాటి తెలిపారు. వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తే ఆ పదవిలో ఎవరూ అవసరం లేదని సీఎం చంద్రబాబుకు చెప్పానని తెలిపారు.

Jonnavithula Ramalingeswara Rao:తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వాలు తలుచుకుంటే పెద్ద కష్టం కాదని మరో ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. చైనా, సింగపూర్ వంటి దేశాల్లో మాతృభాషలోనే చదివి సాంకేతికతను ఉన్నత స్థాయిలో అందిపుచ్చుకుంటున్నారని మనవారు మాత్రం పరాయి భాషలో చదువుతున్నారని అన్నారు. మన బిడ్డలు వేరే దేశాల్లో చదివి ఎక్కడెక్కడో బతుకుతున్నారని జొన్నవిత్తుల ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికలు తెలుగు భాషా వృద్దికి మరింతగా కృషి చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న వివిధ తెలుగు మాండలికాల్లో వార్తా చానళ్ల యాంకర్లు చదవాలని కోరారు.

ఇంటర్ ఫస్టియర్​ విద్యార్థులకు సూపర్ న్యూస్ - పబ్లిక్​ పరీక్షలు తొలగింపు!

శ్రీవారి భక్తులకు అలర్ట్ - కొండపైకి మాస్క్​తో రండి

ABOUT THE AUTHOR

...view details