Women Event Dancer Suspicious Death in Vijayawada :విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈవెంట్ డాన్సర్ మృతి చెందింది. ఈ మృతి అనేక అనుమానాలకు దారి తీస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే, మృతురాలు కాకినాడకు చెందిన బంటుపల్లి వెంకటలక్ష్మి(36)గా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాదులో జీవనం సాగిస్తూ ఈవెంట్ డాన్సర్‌గా పని చేస్తుంది. విజయవాడకు చెందిన కసిం జ్యోతితో వెంకటలక్ష్మికి గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉంది. విజయవాడ వచ్చినప్పుడు అజిత్ సింగ్ నగర్‌లో నివాసముంటున్న జ్యోతి వద్దకు వెంకటలక్ష్మి రాకపోకలు సాగిస్తుంది.
వెంకటలక్ష్మి మృతిపై అనుమానం : ఈ నెల 28న రాత్రి సమయంలో వెంకటలక్ష్మి ఈవెంట్ నిమిత్తం వచ్చి జ్యోతి ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. ఎవరూ చూడని సమయంలో ఉరేసుకుందని జ్యోతి పోలీసులకు తెలిపింది. స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతురాలి ఒంటిపై గాయాలు ఉండడంతో వెంకటలక్ష్మి మృతిపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. వెంకటలక్ష్మిని ఎవరైన హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వెంకటలక్ష్మి ఉరి వేసుకున్న భవనం వద్ద సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.