ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"భూమి కోసం డెత్ సర్టిఫికెట్​ సృష్టించారు" - కళ్లెదుటే మనిషి ఉన్నా గోడు పట్టని అధికారులు - WOMAN COMPLAINT IN COLLECTORATE

Land Grabbing : తన డెత్ సర్టిఫికెట్ సృష్టించి భూమి కాజేశారని కలెక్టరేట్​లో మహిళ ఫిర్యాదు

woman_complaint_in_collectorate
woman_complaint_in_collectorate (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2024, 4:01 PM IST

Updated : Oct 7, 2024, 7:54 PM IST

Woman Complaint in Collectorate on Land Grabbing:భూమిని కాజేయడానికి చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ సృష్టించారని కలెక్టరేట్​లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మావూరి చిన్నమ్మ వీఆర్​వోగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో వీఆర్​వోగా కావలికి బదిలీ చేయడంతో కొంతకాలం కావలిలో ఉన్నారు. దీనిని అదునుగా చూసుకుని స్థానికంగా ఉన్న శేషమ్మ అనే గ్రామస్థురాలు తన భూమిని కాజేసిందని ఫిర్యాదు చేశారు. మొత్తం 5 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుందని తెలిపారు. నేను ఎంత తిరిగినా అధికారులు పట్టించుకోవట్లేదని చిన్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

కోర్టుకు పోతే నేను చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ పుట్టించి నా కేసును కొట్టేసేలా చేశారని కన్నీటితో వివరించారు. వేదనతో నాకు కాళ్లు, చేతులు పడిపోయాయని కొర్టుల చుట్టూ తిరగలేక పోతున్నానని వాపోయారు. రెవెన్యూ ఉద్యోగిగా పనిచేసినా తోటి రెవెన్యూ అధికారులు వద్ద మొర పెట్టుకున్నా న్యాయం జరగలేదని తెలిపారు. 2020లోనే నేను చనిపోయినట్లు కేసును తప్పుదోవపట్టించారని ఆమె ఆవేదనగా తెలిపారు. నేను బతికి ఉన్నానా, చనిపోయానా అధికారులు చెప్పాలని, విచారించి నా భూమిని నాకు ఇప్పించాలని చిన్నమ్మ కోరారు.

"భూమి కోసం డెత్ సర్టిఫికెట్​ సృష్టించారు" - కళ్లెదుటే మనిషి ఉన్నా గోడు పట్టని అధికారులు (ETV Bharat)

నేను వీఆర్వోగా చేశారు. ఆ తరువాత కావలికి బదిలీ అయ్యాను. దీనిని అదునుగా చూసుకుని స్థానికంగా ఉన్న శేషమ్మ అనే మహిళ నా భూమిని కబ్జా చేసింది. మొత్తం 5 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. కోర్టుకు పోతే నేను చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ పుట్టించి నా కేసును కొట్టేసేలా చేశారు. నాకు ఆరోగ్యం సరిగా లేక కొర్టుల చుట్టూ తిరగలేక పోతున్నాను. 2020లోనే నేను చనిపోయినట్లు సృష్టించి కేసును తప్పుదోవపట్టించారు. నేను రెవెన్యూ ఉద్యోగిగా పనిచేసినా తోటి రెవెన్యూ అధికారులు వద్ద మొర పెట్టుకున్నా న్యాయం జరగట్లేదు. అధికారులు స్పందించి నాకు న్యాయం చెయ్యాలి- చిన్నమ్మ , విశ్రాంత వీఆర్వో

"సినీ నటి కాదంబరి కేసు" - వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు - Kadambari Jethwani Case Updates

సీబీఐ వలలో కాకినాడ కస్టమ్స్ అధికారులు - సికింద్రాబాద్​లో పట్టివేత - CBI Arrest Customs Superintendent

Last Updated : Oct 7, 2024, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details