Woman Cheating NRI in Visakhapatnam : తీయటి కబుర్లతో ఓ యువతి.. యువకులను ముగ్గులో దింపి అందిన మేరకు డబ్బులు గుంజుతూ మోసాలకు పాల్పడుతున్న ఘటన ఇది. అమెరికాలో పని చేస్తున్న ఒక ఎన్నారై యువకున్ని మాయమాటలతో దగ్గరకు రప్పించుకుని బలవంతంగా నిశ్చితార్థం చేయించుకుని పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురి చేసిన ఉదంతంతో చివరకు పోలీసులకు చిక్కింది. ఇందుకు సంబంధించి భీమిలి సీఐ బి.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం,
Woman Kidnapped NRI in Visakha :విశాఖ మురళీనగర్‌కు చెందిన కొరుప్రోలు జోయ్ జమీనా (25) అనే యువతి అమెరికాలో ఉంటున్న ఎన్నారై మనోహర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. విశాఖలో నివాసముంటున్న యువకుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి స్నేహితురాలిని అంటూ పరిచయం చేసుకొంది. రోజుల పాటు మంచిగా నటిస్తూ మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా వీరు నిరాకరించారు. దీంతో ఆమె అమెరికా నుంచి యువకుడ్ని రప్పించి విమానాశ్రయం నుంచి నేరుగా మురళీనగర్ ఎన్జీఓ కాలనీలో ఉంటున్న తన ఇంటికి తీసుకుపోయింది. మత్తు పానీయం ఇచ్చి ఇరువురు సన్నిహితంగా ఉంటున్నట్లు ఫొటోలు తీసింది. వాటితో తనను పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేసింది.