Gali Varaprasad Name Issue in Hyderabad:సినిమాల్లో మనం తరచూ చూస్తుంటాం. ఒక వ్యక్తిని వెత్తుక్కుంటూ వచ్చి అదే పేరుతో ఉన్న మరో వ్యక్తిని కొట్టడమో, సన్మానాలు చేయడమో. లేకపోతే వేధించడమో, కిడ్నాప్‌లు చేయడమో లాంటి ఘటనలు చాలా సినిమాల్లో మనకు తారసపడుతుంటాయి. అచ్చం ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో వెలుగు చూసింది. ఓ వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చిన కొందరు అదే పేరు గల మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బాధితుడి ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.
వెతుక్కుంటూ వచ్చి దాడి : పూర్తి వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గాలి వరప్రసాద్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 17వ తేదీ అర్ధరాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు వరప్రసాద్ అనే వ్యక్తిని వెతుక్కుంటూ కేపీహెచ్‌బీ కాలనీకి వచ్చారు. చివరికి ఓ హాస్టల్‌లో వరప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడని తెలుసుకున్నారు. దీంతో హాస్టల్ నిర్వాహకులు వరప్రసాద్‌కు సమాచారం ఇవ్వడంతో వచ్చింది ఎవరో తెలుసుకునేందుకు హాస్టల్ నుంచి బయటకు వచ్చాడు. వెంటనే అసలు వ్యక్తి ఎవరో అని నిర్ధారించుకోకుండానే యువతి, ముగ్గురు వ్యక్తులు ఇష్టానుసారంగా అతనిపై దాడి చేశారు. దాడిలో గాలి వరప్రసాద్ దవడకు, పెదవి లోపల గాయాలయ్యాయి.
హాస్టల్‌లో చేర్పిస్తారనే భయంతో కిడ్నాప్ డ్రామా - విస్తుపోయిన పోలీసులు