ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో దారుణం - మంచం కింద డిటోనేటర్లు పేల్చి వీఆర్‌ఏ హత్య - Detonators Blast in YSR District - DETONATORS BLAST IN YSR DISTRICT

VRA Died in Kadapa District : పులివెందుల నియోజకవర్గంలో డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ పేలుళ్లు కలకలం రేపాయి. వేమూరు మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్ఏ నరసింహ దంపతులు నిద్రిస్తుండగా బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి బ్యాటరీ సాయంతో పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నరసింహ మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ వైఎస్సార్సీపీ నేత నిర్వహిస్తున్న మ్యాగజైన్‌ నుంచి జిలెటిన్ ​స్టిక్స్‌, డిటోనేటర్లు తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Detonator Blast in YSR District
Detonators Blast in YSR District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 11:04 AM IST

Updated : Sep 30, 2024, 2:40 PM IST

Detonators Blast in YSR District : వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం కొత్తపల్లికి చెందిన వీఆర్ఏ నరసింహ, సుబ్బలక్ష్మమ్మ దంపతులు ఇంటి ఆవరణలోని రేకులషెడ్డులో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో మంచం కింద పేలుడు పదార్థాలు పేలాయి. పేలుడు ధాటికి నరసింహ మృతిచెందగా భార్య సుబ్బలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల అదుపులో అనుమానితులు : ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణంగా ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామన్నారు. బాబు అనే వ్యక్తి కొంతకాలంగా తన తండ్రితో గొడవలు పడుతున్నాడని మృతుడి కుమార్తె తెలిపారు.

ఈ కేసులో అనుమానితులు బాబు, రమేశ్‌ ఇద్దరూ వేముల సమీపంలోని వేర్వేరు ముగ్గురాయి గనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. సాధారణంగా గనులు పేల్చడానికి జిలెటిన్​స్టిక్స్‌, డిటోనేటర్లు, అమ్మోనియా నైట్రేట్‌ వినియోగిస్తుంటారు. పేలుడు పదార్థాలను గని యజమాని కనుసన్నల్లోనే కూలీలు పేలుస్తుంటారు. కాగా వీటిని అనుమానితులు ఇళ్లకు ఎలా తెచ్చుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గనుల తవ్వకాలకు ఉపయోగించే జిలెటిన్ ​స్టిక్స్‌, డిటోనేటర్లు, అమ్మోనియో నైట్రేట్‌ పులివెందులలోని మ్యాగజైన్‌ కేంద్రంలో లభిస్తాయి. ప్రభుత్వ లైసెన్స్‌ పొందిన ఈ మ్యాగజైన్‌ను పులివెందుల వైఎస్సార్సీపీ నేత ఒకరు నిర్వహిస్తున్నారు. కూలీలు పేలుడు పదార్థాలను అక్కడి నుంచి తీసుకొచ్చారా లేక గని యజమాని కళ్లుగప్పి చోరీ చేశారా అనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ముగ్గురాయి గని యజమాని శ్రీనివాసులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

VRA Killed in Kadapa District : ఆరేళ్ల కిందట కలసపాడు మండలంలోని అక్రమంగా తవ్వకాలు చేస్తున్న గని కోసం తెచ్చిన జిలెటన్ స్టిక్స్, డిటోనేటర్లు పేలి 10 మంది కూలీలు మృతిచెందారు. ఇవన్నీ కూడా పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ నేత మ్యాగజైన్ నుంచి తరలించినట్లు అప్పట్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా కొత్తపల్లిలో జిలెటెన్​ స్టిక్స్, డిటోనేటర్లు పేలడం అనుమానాలు రేకెత్తిస్తోంది.

పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురు యువకుల దుర్మరణం - ROAD ACCIDENT

Last Updated : Sep 30, 2024, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details