ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోర్న్ వీడియోలు చూపించి వేధిస్తున్న భర్త - ఆత్మహత్య చేసుకున్న భార్య - WOMAN DIED IN VISAKHAPATNAM

అశ్లీల వీడియోలకు బానిసైన భర్త - మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న భార్య

Woman Died in Visakhapatnam
Woman Died in Visakhapatnam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2025, 9:55 AM IST

Woman Died in Visakhapatnam : ఉన్నది ఒక్కటే జీవితం. కానీ నేటి కాలంలో ఒక్కక్షణం ఒకే ఒక్కక్షణంలో తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఎన్నో జీవితాల్ని తలకిందులు చేస్తున్నాయి. అప్పటి వరకు, ఆ క్షణం ముందు వరకు మనతో, మన మధ్యనే ఉంటున్న వారు శాశ్వతంగా మన మధ్య నుంచి దూరమైపోయారనే మాటే కుటుంబాల్లో పిడుగుపాటవుతోంది. బలవనర్మణాలు కన్నీటి చారికల తడి ఆరనివ్వడం లేదు. వాటి గాయాలు మానడం లేదు. బాధిత కుటుంబాలు కుదుట పడడం లేదు.

ఇటీవలే బంధుమిత్రుల సమక్షంలో ఆ తల్లిదండ్రులు కుమార్తెకు వైభవంగా వివాహం చేశారు. తమ బాధ్యత తీరిందని ఆనంద బాష్పాలతోనే అత్తింటికి సాగనంపారు. కానీ వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఏడడుగులు మూడు ముళ్లు నూరేళ్ల కలలతో అత్తవారింట అడుగుపెట్టిన ఆ యువతి ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి. బాజాభజంత్రీలు మోగిన ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. నూరేళ్ల దాంపత్య జీవితం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లై సంవత్సరం గడవక ముందే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

Gopalapatnam Woman Death Case : దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గోపాలపట్నం పరిధిలో నివాసం ఉంటున్న నాగేంద్రబాబుకు ఓ యువతితో 11 నెలల క్రితం వివాహం జరిగింది. అతడు ఎలక్ట్రీషియన్​గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులు కాపురం సజావుగా సాగింది!. కానీ అతను పోర్న్ వీడియోలకు బానిసగా మారాడు. వయాగ్రా మాత్రలు వేసుకుంటూ, అశ్లీల వీడియోలు భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధిస్తున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో మనస్తాపం చెందిన బాధిత యువతి ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. భర్త వికృత చేష్టలు, వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

రాత్రి వేళ ఒక్కొక్కరుగా పొలానికి - అనుమానంతో వెళ్లి చూసిన గ్రామస్థులు షాక్

మోసపోయానని ఒకరు - పరువు పోతుందని మరొకరు

ABOUT THE AUTHOR

...view details