ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ సీపీ సతీమణి సెటిల్​మెంట్​- వైద్యదంపతులను నిర్బంధించిన వైనం - Visakha CP wife threatened couple - VISAKHA CP WIFE THREATENED COUPLE

Visakha CP Wife Detained and Threatened the Medical Couple: ఆమె ఓ పోలీసు అధికారి భార్య. ఆమె ఆదేశించారని అర్ధరాత్రి వేళ ఓ ఆసుపత్రిలో వైద్యదంపతుల్ని, వారి ఎనిమిది నెలల చిన్నారిని 2 గంటల వరకూ పోలీసులు నిర్బంధించారు. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నా వదలకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. సివిల్‌ పంచాయితీలో తలదూర్చి పత్రాలపై సంతకాలు చేయాలంటూ ఒత్తిడి చేశారు. ఆవిడ ఎవరో కాదు విశాఖ సీపీ రవిశంకర్‌ భార్య సతీమణి డాక్టర్‌ సుమితా శంకర్‌ ఈ ఘటన గత సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

visakha_cp_wife_threatened_couple
visakha_cp_wife_threatened_couple (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 1:22 PM IST

Visakha CP Wife Detained and Threatened the Medical Couple:అసలే అయ్యగారి భార్య ఆమె ఆదేశించారని అర్ధరాత్రి వేళ ఓ ఆసుపత్రిలో వైద్యదంపతుల్ని, వారి ఎనిమిది నెలల చిన్నారిని 2 గంటల వరకూ పోలీసులు నిర్బంధించారు. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నా వదల్లేదు. ఆ జంటపై బెదిరింపులకు దిగారు. సివిల్‌ పంచాయితీలో తలదూర్చి పత్రాలపై సంతకాలు చేయాలంటూ ఒత్తిడి చేశారు. అందరూ కౌంటింగ్‌ సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉంటే గుంటూరు అరండల్‌పేట పోలీసులు మాత్రం అయ్యగారి భార్య తరపున సివిల్‌ దందా నడిపించారు. ఆ అయ్యగారు విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ కాగా పోలీసులతో కలిసి వైద్యదంపతుల్ని నిర్బంధించి, బెదిరించినవారు ఆయన సతీమణి డాక్టర్‌ సుమితా శంకర్‌. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అర్ధరాత్రి వరకూ నిర్బంధించడం నేరం కాదా:ఇద్దరు వ్యాపార భాగస్వాములకు సంబంధించిన సివిల్‌ వివాదంతో అసలు పోలీసులకు ఏం పని? అర్ధరాత్రి వరకూ మహిళను, చిన్నారిని నిర్బంధించడం, బెదిరించడం, సంతకాలు చేయాలని ఒత్తిడి తేవడం ఎందుకు? సివిల్‌ పంచాయితీ చేయడానికి అసలు పోలీసులను అక్కడికి ఎవరు రప్పించారు? రవిశంకర్‌ అయ్యన్నారా? ఆయన సతీమణి సుమితా శంకరా? ఎవరు రప్పిస్తే వాళ్లపైన, వారి ఆదేశాల మేరకు అక్రమ నిర్బంధానికి పాల్పడ్డ అరండల్‌పేట సీఐ వెంకటేశ్వరెడ్డిపైన ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? పోలీసు అధికారి భార్య అయితే ఏం చెబితే అది చేసేస్తారా? వారికి చట్టం వర్తించదా? నీతులు వల్లించే రవిశంకర్‌ అయ్యన్నార్‌ గారూ ఇది అధికార దుర్వినియోగం కాదా?

టీడీపీ కార్యకర్తపై పులివెందుల ఎస్సై దాడి - స్పృహ తప్పిపడిపోయిన బాధితుడు

భాగస్వాములుగా చేర్చుకుంటానంటూ మోసం:సుమితా శంకర్‌ హెల్త్‌ యూనివర్సిటీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూనే గుంటూరు అరండల్‌పేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రి నడిపిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన డాక్టర్‌ సుమతి, నిరంజన్‌ దంపతుల్ని తన ఆసుపత్రిలో భాగస్వాములుగా చేర్చుకుంటానని చెప్పి ఏడాదిన్నర క్రితం వారినుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు. నెల రోజుల పాటు ఆసుపత్రిలో వారితో ప్రాక్టీస్‌ చేయించిన తర్వాత వారిని బయటకు పంపారు.

తమ సొమ్ము తిరిగివ్వాలని వారు ఎంత కోరినా పట్టించుకోలేదు. పలుమార్లు సంప్రదింపుల అనంతరం చర్చల కోసమంటూ ఆ దంపతులను సోమవారం రాత్రి తన ఆసుపత్రికి పిలిపించి పోలీసులతో కలిసి నిర్బంధించారు. కాగా తమకు జరిగిన అన్యాయంపై బయట మాట్లాడేందుకు కూడా బాధితులు భయపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారి, ఆయన భార్య ఒత్తిడి వల్ల ఏం చెబితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

కబంధహస్తాల నుంచి బయటపడ్డట్టే - దిమ్మతిరిగేలా విశాఖ ప్రజల తీర్పు - Visakhapatnam People Shock to YSRCP

ఎవర్నీ బంధించలేదు బెదిరించలేదు:డాక్టర్‌ నిషాంత్‌ నా ఫొటో పెట్టుకుని తప్పుడు విధానాలతో ప్రాక్టీసు చేశారని డాక్టర్‌ సుమితా శంకర్‌ అన్నారు. మా పేషెంట్లను లాగేసుకుని మోసగించారని తెలిపారు. నిషాంత్‌ దంపతులు మా ఆసుపత్రిలో భాగస్వాములుగా చేరి రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారని ఆసుపత్రిలో ప్రాక్టీసు చేసినందుకు వారికి ప్రతి నెలా రూ.4 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలిపారు. వారు ఆసుపత్రిలో ఉండేందుకు గది కేటాయించామని మొత్తం రూ.50 లక్షల వరకు ఇచ్చామని అన్నారు.

వారినుంచి పెట్టుబడిగా తీసుకున్న మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ల డేటా చోరీచేసి పేషెంట్ల ఫోన్‌నంబర్లు తీసుకుని వారితో టచ్‌లో ఉంటూ నా ప్రాక్టీస్‌ దెబ్బతీశారని అన్నారు. డేటా చోరీపై అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎవరినీ బంధించలేదని, బెదిరింపులకు గురిచేయలేదని అని డాక్టర్‌ సుమితా శంకర్‌ చెప్పారు. ఈ అంశంపై రవిశంకర్‌ అయ్యన్నార్‌ను సంప్రదించగా ఆయన కూడా ఇవే మాటలు చెప్పారు. అరండల్‌పేట సీఐ వెంకటేశ్వరరెడ్డి వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

కనీసం ఈసారైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లు! - Police ready to arrest Pinnelli Ramakrishna Reddy

రవిశంకర్‌ అయ్యన్నార్‌కు అంతా తెలుసు:మేం పెట్టిన పెట్టుబడిలో రూ.12.50 లక్షలు చెల్లిస్తామని చెప్పి సుమితా శంకర్‌ ఆసుపత్రికి పిలిపించారని బాధిత వైద్యుడు డాక్టర్‌ నిషాంత్‌ తెలిపారు. తాను ఇచ్చినంత తీసుకోవాలని పెట్టాలన్నచోట సంతకం చేసి వెళ్లిపోవాలని బెదిరించారని వాపోయారు. అందుకు అంగీకరించకపోవడంతో రాత్రి 2గంటల వరకూ ఆసుపత్రిలో బంధించారని అన్నారు. మీపై కేసులు పెట్టి లోపలేస్తా అంటూ అరండల్‌పేట సీఐ వెంకటేశ్వరెడ్డి బెదిరించారని అన్నారు.

మేం ఆసుపత్రిలో భాగస్వాములుగా ఉన్న విషయం రవిశంకర్‌ అయ్యన్నార్‌కు తెలుసని మాకు చెల్లించాల్సిన డబ్బుల గురించి కూడా తెలుసని అన్నారు. వాటి గురించి అడిగేందుకు విశాఖపట్నంలోని ఆయన కార్యాలయానికి వెళ్లగా కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని తెలిపారు. గత నెలలో ఈ వివాదంపై గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి కొందరు అధికారులు పిలిచి వివాదం ఎందుకు ఎంతో కొంత తీసుకుని వెళ్లిపోవాలని చెప్పారని డాక్టర్‌ నిషాంత్‌ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details