Vinayaka Chavithi Celebrations in Vijayawada:విజయవాడను వరదలు ముంచెత్తడంతో వినాయకచవితి పండగ సందడి కనిపించడంలేదు. మరికొన్ని గంటల్లో వినాయకుడికి తొలిపూజ చేయాలని సంకల్పం గట్టిగా ఉన్నప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో నిరాశకు లోనవుతున్నారు. కృష్ణమ్మ, బుడమేరు వరదలకు విజయవాడ వన్‌టౌన్ ప్రాంతం అతలాకుతలం కావడంతో ఆ ప్రాంతంలో ఏటా కనిపించే వినాయక చవితి కోలాహలం ఇప్పుడు కనిపించడంలేదు. ఇంకా వరద ముంపులోనే ఆ ప్రాంతాలు కొనసాగుతుండడం విద్యుత్తు సరఫరా లేకపోవడం, ఇళ్లు అపరిశుభ్రంగా ఉంటోన్న తరుణంలో విఘ్నవినాశకా తమ అవస్థలు తీర్చాలని వేడుకుంటున్నారు.
విజయవాడ నగరంలోనూ పండుగ సందడి స్తబ్ధుగానే ఉంది. వరద దెబ్బకు పంటలు నష్టపోవడంతో పండ్లు, పూల ధరలకు రెక్కలు తొడుకున్నాయి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ తమకు ఇలాంటి ఆపదలు రాకుండా కాపాడాలంటూ గణపతిని తమకు తోచిన రీతిలో నమస్కరించుకోవాలని బెజవాడ వాసులు భావిస్తున్నారు. ఏటా వినాయక విగ్రహాలు, పండ్లు, పూలు, పత్రిల కొనుగోలుతో సందడిగా ఉండే మార్కెట్, ప్రధాన రహదారులు వరదల వల్ల బోసిపోయి కనిపిస్తున్నాయి. పూలు, పండ్లు దుకాణాల వద్ద ఓ మోస్తరు రద్దీ ఉంటోంది. అప్పు చేసి మరీ వినాయక ప్రతిమల విక్రయ దుకాణాలు పెట్టిన వారంతా తమకు ఆదాయం ఎంతవరకు వస్తుందనే మీమాంసంలో ఉన్నారు.
బుడమేరుకు చేరుకున్న ఆర్మీ - గండ్లు పూడ్చివేత పనులు వేగవంతం - LEAKAGE WORKS Under Indian Army
పత్రి, పూలు, పండ్ల ధరలు బాగా పెరిగాయి. వీధుల్లో పందిళ్లు చాలా వరకు తగ్గిపోయాయి. గణపతి నవరాత్రులకు సిద్ధమవుతున్న సమయంలో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి బీభత్సం సృష్టించడంతో ప్రజలు ఇంకా కష్టాల నుంచి తేరుకోలేదు. వరద ప్రభావం లేనిచోట్ల ఒకింత పండుగ సందడి కనిపిస్తున్నా సాదాసీదాగానే వ్యాపారాలు సాగుతున్నాయి. పండగ చేసుకోలేని వారి తరపున కూడా తామే పూజ చేస్తామని కొందరు, ఇలాంటి వరద పరిస్థితులు భవిష్యత్తులో రాకూడదనీ మరికొందరు కోరుకుంటున్నారు. వినాయకచవితికి ముందు రోజు నగరంలోని రహదారులకు రెండువైపులా పత్రి, ఫూలు, పండ్ల దుకాణాలు కళకళలాడుతూ ఉంటాయి. ట్రాఫిక్‌కు అంతరాయం అంతా ఇంతా ఉండదు.
కుటుంబ సమేతంగా వచ్చి కొనుగోళ్లు జరుపుకునే వారితో సందడిగా కనిపించే మార్కెట్ ఇప్పుడు బోసి పోయింది. మట్టి వినాయక విగ్రహాలతోపాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు కూడా మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. చిరు వ్యాపారులు తమ బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టి వినాయకుని ప్రతిమలు తయారు చేసి తీసుకొచ్చారు. ప్రస్తుత వరద పరిస్థితులలో ప్రతిమలు కొనేవారే లేరని, కనీసం అప్పు చేసిన సొమ్మైనా వస్తే చాలు దేవుడా, అప్పులుపాలు కాకుండా ఉండాలని ఆశిస్తున్నారు.
కేంద్రం వరద సాయం - తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు - central govt announce flood relief
వరద ప్రాంతాల్లో మూగజీవుల ఆకలి కేకలు - పశుగ్రాసం సరఫరా చేయాలని రైతుల విజ్ఞప్తి - Flood Areas No Food in Cattles