Vijayawada People Suffered Under YSRCP Government:ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అస్తవ్యస్త నిర్ణయాలతో విసుగెత్తిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమి గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు తమ ఉపాధి అవకాశాలను దెబ్బకొట్టిన జగన్ చెత్తపన్ను వసూలు, ఏటా ఆస్తి పన్ను పెంపు వంటి విధానాలతో తమను పీల్చిపిప్పి చేశారని బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా చెత్తపన్ను మాటున గుదిబండ మోపారని వాపోయారు. అందుకే జగన్ సర్కార్ను ఇంటికి సాగనంపామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని విజయవాడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భయం,బానిసత్వం నుంచి బయటపడ్డామనే భావనలో ఆర్టీసీ ఉద్యోగులు - APSRTC Employees Problems
నిత్యవసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుని అదుపు చేయాలని గత ఐదేళ్లలో ప్రజలు పెద్ద ఎత్తున గళమెత్తినా జగన్ సర్కార్ కనికరించలేదు. దీనికి తోడు ఎన్నడూ లేని విధంగా చెత్తపన్ను, ఏటా 15శాతం ఆస్తి పన్ను పెంపు నిర్ణయాలతో సామాన్యుల నడ్డి విరిచింది. విద్యుత్ సర్దుబాటు, ట్రూ అప్‌ల పేరుతో విద్యుత్ ఛార్జీలను అదనంగా ముప్పై శాతం వరకు పెంచింది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు జగన్ సర్కార్ను ఘోరంగా ఓడించారు.
వైఎస్సార్సీపీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లోని కార్మికులు, చిరుద్యోగులు చేతినిండా పని లేక వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు. ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం బూటకపు మాటలతో కాలం వెళ్లదీసిందని ప్రజలు విమర్శించారు.