ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిపితే కన్నీళ్లే: వరద తెచ్చిన నష్టం కష్టం- కంటి మీద కునుకు లేదు -ఈటీవీ భారత్‌తో విజయవాడ వాసుల గోడు - AndhraPradesh Floods

కృష్ణా నదికి వరద పోటెత్తడంతో విజయవాడ నగరం అతలాకుతల మైంది. నాలుగు రోజులుగా ఇళ్లలోకి నీరు చేరి కంటి మీద కునుకు లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని పలు కాలనీల్లో బాధితులను 'ఈటీవీ భారత్‌ బృందం' పలకరించగా వరదతో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు.

విజయవాడ వాసుల గోడు
విజయవాడ వాసుల గోడు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 1:34 PM IST

వరుణుడు, కృష్ణమ్మ విజయవాడ నగరంపై కన్నెర్రజేశాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు బుడమేరుకు గండ్లు పడ్డాయి. దీంతో నాలుగు రోజులుగా నగరంలో వరద బీభత్సం సృష్టించింది. రోడ్లు, కాలువలు ఏకమై పారాయి. లక్షకుపైగా ఇళ్లు జలమయమయ్యాయి. కొన్ని రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేక, బాధితులు తిండికి, నీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొందరు వస్తు వులు పాడైతే పాడయ్యాయని ప్రాణాలతో బయటపడాలని ఇళ్లొదిలి పునరావాస కేంద్రాలు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.

విజయవాడ వరద బాధితులు (ETV Bharat)

ఇళ్లలో నీరు చేరడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇంట్లోని కుర్చీలు, బీరువాలు, ఫ్రిజ్లు, గ్రైండర్లు, మంచాలు, ఇలా అన్నిరకాల విద్యుత్తు, ఫర్నిచర్ సామగ్రి నీటమునిగాయి. వస్తువులు రోజుల తరబడి వరద నీటిలో ఉండడంతో పాడయ్యాయి. కొన్నిం టిలో బురద చేరిపోయింది. సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలే. వారందరిదీ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. నీట నానిన సామగ్రి మరమ్మతులకు ఎంతెంత ఖర్చవుతుందో అని బాధితులు అల్లాడుతున్నారు.

విజయవాడ వరద బాధితులు (ETV Bharat)


సకాలంలో స్పందించకుంటే ప్రాణాలు పోయేవి
"గత మూడురోజులు మా కాల నీలో పీకల్లోతు నీరు ఉంది. పై అంతస్తు నుంచి కిందకు రాలేని పరిస్థితి. ఇంతటి వరద లోనూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంటింటికీ తిరిగి ఆహార పొట్లాలు అందిస్తే.. కుడుపు నింపుకొని, గొంతు తడుపుకొన్నాం. ప్రభుత్వం సకా లంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టకపోతే మా కాలనీలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే వాళ్లం"

చిన్నమ్ములు, భువనేశ్వరి, చిట్టమ్మ, కొత్త రాజరాజేశ్వరిపేట

పింఛనే ఆధారం.. వస్తువులన్నీ తడిసిపోయాయి
"వరద తగ్గ డంతో ప్రాణాలు అరచేతిలో పెట్టు కొని ఒడ్డుకు చేరు ము కున్నాం. మా డో ఇంట్లో బియ్యం, వస్తువులన్నీ తడిసిపోయాయి. రదకు సుమారు రూ.50 వేలు నష్టపోయాం. వృద్ధాప్య ఆడిపో పింఛనుపై ఆధారపడి జీవించే మాకు మళ్లీ వాటిని తికా. కొనుక్కునే ఆర్థిక స్తోమత లేదు. కుమారుడు "తుడి కూడా కూలి పనులు చేసుకుంటూ భార్యాపిల్లలను కానిక్ పోషించుకుంటున్నాడు. ప్రభుత్వమే మమ్మల్ని దోళ ఆదుకోవాలి"

బట్టు భాస్కరరావు, బేబిసరోజ, ఇంద్రానాయక్ నగర్

జీవనాధారం పోయింది.. ఎలా బతకాలి?
"పైపుల రోడ్డు తోపుడు బండిపై ఫ్యాన్సీ వస్తువులు పెట్టుకుని అమ్ముతుంటాను. శనివారం రాత్రి బండిని ఇంటి ముందు పెట్టాను. ఆదివారం తెల్లారిన తర్వాత వరద నీరు పోటెత్తింది. ఇంటి ముందు ఉన్న బండి కొట్టుకెళ్లింది. అందులో వస్తువులన్నీ బురదతో పాడ య్యాయి. రూ.20 వేలు నష్టం వచ్చింది.. ఎలా బతకాలో అర్థం కావడం లేదు"

షేక్ హుస్సేన్బీ, సింగ్‌నగర్

అమ్మకు మందుల్లేక
"నందమూరి నగర్, సన్సిటీ కాలనీ వరద ఆదివారం ఉదయం వచ్చింది. తేరుకునేలోపే ఇంట్లోకి మోకాల్లోతు నీరు వచ్చేసింది. ఆ సమయంలో నేను, నా భార్య, ఏడాదిన్నర బాబు, అమ్మ ఉన్నాం. ఇద్దరినీ మొదటి అంతస్తులోకి పంపించాం. మా అబ్బా యికి తాగేందుకు పాలు లేక మూడు రోజులు ఇబ్బంది పడ్డాం. అమ్మకు మందులు అయిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, సామగ్రి అన్నీ పాడయ్యాయి. ఆహార పొట్లాలు కూడా మాకు అందలేదు"

షేక్ బాజీ , నందమూరి నగర్‌

అటు భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపున‌కు గురైన ప్రాంతాల్లో ఉన్న గర్భిణుల‌పై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. వరద ముంపు ప్రాంతాల్లో ఉండి తదుపరి 10 రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న 154 మంది గర్భిణుల‌ను ఆరోగ్య శాఖ సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. పునరావాస కేంద్రాలకు అనుబంధంగా 14 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 17,538 మంది రోగులు సేవ‌ల్ని అందుకున్నార‌న్నారు.

వరద ఉద్ధృతి నుంచి కోలుకుంటున్న విజయవాడ - పునరావాసాలు వీడి ఆవాసాలవైపు కదులుతున్న బాధితులు

బైక్ ఇంజన్​లో బురద- వరద కథల్లో ఇదో వ్యథ

ABOUT THE AUTHOR

...view details