Vaikunta Ekadasi Arrangements at Tirumala :తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి భక్తులకు జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సులభతరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎస్ఎస్డీ టోకెన్ల జారీ, భక్తుల భద్రత, దర్శనం, వసతి, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నప్రసాదం ఇతర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వైకుంఠ ఏకాదశి ముఖ్యాంశాలతో సమగ్ర మాస్టర్ డాక్యుమెంట్ రూపొందించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు అదనపు ఈవోకు వివరించారు. అంతకముందు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈవో, అదనపు ఈవోలతో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
'పదిరోజులకుగానూ అన్ని ఏర్పాట్లు చేశాం. సుమారు 7లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా వేస్తున్నాం. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాం. వీఐపీ భక్తులకు పార్కింగ్‌కు ఇబ్బంది ఎదురవకుండ ఏర్పాట్లు చేశాం. టికెట్ లేకుండా ఎవరూ దర్శనానికి రాకూడదని మా విజ్ఞప్తి.' - టీటీడీ ఈవో శ్యామలరావు