Face morphing cases in krishna District : వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళల చిత్రాలను అప్‌లోడ్ చేస్తుంటారు. కొద్ది మంది ఉన్మాదులు ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మారుస్తున్నారు. వాటిని వారి కుటుంబ సభ్యులకు పంపి మరీ డబ్బులు పంపాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఒక్కోసారి సామాజిక మాధ్యమాల్లో సైతం పెట్టేస్తున్నారు. సున్నితమైన వారు ఇటువంటి వాటికి ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగితే ఆందోళన చెందవద్దని తాము అండగా ఉంటామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు భరోసా ఇస్తున్నారు. వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్, సైబర్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
సైబర్ కేఫ్ రిపోర్టులో నమ్మలేని నిజాలు- ఆ బ్యాంకుల కస్లమర్లే అధిక బాధితులట - cyber crime in banking sector
ఇలా చేస్తే మేలు: మీ ఫొటోలతో అశ్లీల చిత్రాలు రూపొందించి ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంటే నేరుగా మీరే ఫిర్యాదు చేయవచ్చు. మీ చరవాణికి వచ్చిన ఫొటోలను www.stopncii.orgవెబ్‌సైట్‌కు పంపించాలి. ఇందులోని 9 రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఫింగర్ ప్రింట్ తరహాలో ఒక కేసు నమోదు అవుతుంది. తర్వాత మీకు వచ్చిన ఫొటోలను ఆప్‌లోడ్ చేయాలి. ఎవరైనా ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడితే వెంటనే గుర్తించి తొలగిస్తుంది. ఆయా వివరాలను కూడా మీకు వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తుంది.
ఫింగర్ ఫ్రింట్ తరహాలో ఫోటో గుర్తింపు: అంతర్జాతీయంగా నిర్వహించే ఈ వెబ్‌సైట్ పూర్తిగా భద్రమైందని పోలీసులు హామీ ఇస్తున్నారు. మీరు అప్‌లోడ్ చేసిన ఫొటోలను డౌన్‌లోడ్ చేయదు. డిజిటల్ ఫింగర్ ఫ్రింట్ ద్వారా ఒక ప్రత్యేకమైన ‘యాష్’ను అది తయారు చేస్తుంది. వేలిముద్రను మనం ఎలాగైతే గుర్తిస్తామో డిజిటల్ ఫింగర్ ఫ్రింట్ తరహాలో మీ ఫొటోతో రూపొందిన ఈ ప్రత్యేకమైన ‘యాష్’.. సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ అయినా వెంటనే ఫొటోలను గుర్తించి తొలగిస్తుంది. 2015లో రూపొందించిన ఈ వెబ్‌సైట్.. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 2 లక్షల మంది అశ్లీల చిత్రాలను తొలగించి, వారికి వ్యక్తిగత రక్షణ కల్పించింది.
యువతా జాగ్రత్తపడండిలా..!
- సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టకుంటే మేలు.
- ఫొటోలు పెట్టినా.. వాటి యాక్సెస్ ఇతరులకు ఇవ్వవద్దు.
- మీ ప్రొఫైల్, ఫొటోలను ఇతరులు డౌన్‌లోడ్ చేయకుండా లాక్ చేసుకోవాలి.
- ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే బ్లాక్ లిస్ట్‌లో పెట్టేయండి.
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం- 28200 మొబైళ్లు బ్లాక్- 20లక్షల నంబర్లు కట్! - DOT BLOCKS MOBILE HANDSETS
రూ.20 కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్లు - పెట్టుబడుల పేరుతో లూటీ చేస్తున్న ఇద్దరి అరెస్టు - Police Arrested Two Cyber Criminals