Union Minister Raj Bhushan Clarity on Polavaram Project Height :పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించబోతున్నారనే వైఎస్సార్సీపీ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. అలాంటి ఉద్దేశం ఏమీ లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నలకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌధరి సమాధానం ఇచ్చారు.
MP YV Subba Reddy on Polavaram Height : పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించబోమని రాజ్‌భూషణ్ అన్నారు. గోదావరి జల వివాద ట్రైబ్యునల్ అవార్డు-1980 (Godavari Water Dispute Tribunal Award-1980) ప్రకారం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని 45.72 మీటర్ల మేర నిలిపేలా నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. "కేంద్రం పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను 41.5 మీటర్లకు తగ్గించిన మాట వాస్తవనా? ఇందుకు రూ.30,436 కోట్ల మేర ఆమోదం తెలపడం నిజమేనా? నీటి నిల్వ సామర్థ్యాన్ని 45.72 మీటర్లకు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇది వరకు ప్రతిపాదనలు పంపిందా? అలాగే అంచనాలను సవరించాలని కోరిందా? అలాగైతే నీటి నిల్వసామర్థ్యాన్ని తగ్గించడానికి, 55 వేల657 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించడానికి కారణమేంటి?" అని సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు రాజ్‌భూషణ్ సమాధానం ఇచ్చారు.