Piyush Goyal Fires On YSRCP Govt: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం యువత, శ్రామికులు, రైతులపై తీవ్ర నిర్లక్ష్యం చూపిందని కేంద్ర మంత్రి పియూష్‌గోయల్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అపారమైన సహజ వనరులు, ప్రతిభావంతులైన ప్రజలు, కష్టపడే మనుషులు,నిపుణులు ఉన్నప్పటికీ అన్ని రంగాలను వైసీపీ ప్రభుత్వం అలక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.
అవినీతికి పెద్దపీట: రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం శ్యాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియా ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని పియూష్‌గోయల్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం సక్రమంగా అమలు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగిందని విజయవాడ హోటల్ హయత్‌ప్లేస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టి - అవినీతికి పెద్దపీట వేసిందని విమర్శించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి 21.32 లక్షల ఇళ్లను మోదీ ప్రభుత్వం మంజూరు చేస్తే - కేవలం 3.25 లక్షల ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు ఇవ్వగలిగిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల మేర కేంద్రం గ్రాంట్‌లు విడుదల చేసినప్పటికీ, వైసీపీ ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడానికి అవినీతికి పాల్పడుతూ- గడువులను పొడిగించుకుని- రాష్ట్ర రైతులకు ద్రోహం చేసిందని అన్నారు.
ఎన్నికల బరిలో ముఖ్యమంత్రుల వారసులు - వాళ్లు ఎవరో తెలుసా? - AP ELECTIONS 2024
ఎనిమిది వేల కోట్లు: రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చినా - విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయానికి అనువైన స్థలాన్ని చూపించకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందని పియూష్‌గోయల్ ఆరోపించారు. ఎనిమిది వేల కోట్ల రూపాయల పంచాయతీ నిధులను దారిమళ్లించిందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం విజయం సాధించిన వెంటనే విశాఖ రైల్వే జోన్ స్థలం కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని - త్వరలోనే ఆ కల సాకారం అవుతుందన్నారు. జగన్ దుష్టపాలనలో అవినీతి వేళ్లూనుకుపోయిందని సీఎం స్వార్థ ప్రయోజనాలతో రాష్ట్ర అభివృద్ధి వెనక్కి వెళ్లిందన్నారు. జూన్ 4 తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం కోల్పోయిన వైభవాన్ని చంద్రబాబు తిరిగి తీసుకొస్తారని చెప్పారు.
పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి తెలుగు నటుడు ఎవరో తెలుసా?- దేశ రాజకీయాల్లో మన సినీతారలెందరో! - Telugu film celebrities in politics
సుజనా చౌదరికి రికార్డు మెజారిటీ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి రికార్డు మెజారిటీతో గెలవడం ఖాయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోస్యం చెప్పారు. సుజనా చౌదరి తనకు మంచి మిత్రులని, తామిద్దరం 2010లో ఒకేసారి పార్లమెంట్ లో అడుగుపెట్టామని గుర్తు చేసుకున్నారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఏపీ ప్రజల కోసం సుజనా చౌదరి సైనికుడిలా పని చేశారని, ఏపీ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించారని ప్రశంసించారు.
ఐదేళ్లుగా మాట్లాడకుండా వివేకాపై విద్వేషం ఎందుకు జగనన్నా?: సునీత - Sunita Fire on Jagan
శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియాలతో కోట్లు దోచుకున్నారు: పీయూష్ గోయల్