ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆడుకుంటూ అనంతలోకాలకు - ఇద్దరు చిన్నారుల మృతితో శోకసంద్రంలో గ్రామం - Two Children Died at Small Pond - TWO CHILDREN DIED AT SMALL POND

ప్రాణాలు తీసిన నీటి కుంట - దసరా సెలవుల్లో విషాదం

Two Children Fell into a Small Pond while Playing and Died
Two Children Fell into a Small Pond while Playing and Died (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2024, 8:06 PM IST

Two Children Fell into a Small Pond while Playing and Died : దసరా సెలవులను తాతయ్య, నానమ్మలతో సరదాగా గడపాలని ఆశపడ్డ ఇద్దరు చిన్నారులను ఓ నీటికుంట తిరిగిరాని లోకలకు తీసుకెళ్లింది. సరదాగా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడటంతో ఇద్దరు చిన్నారులు అడ్డికక్కడే మృతి చెందారు. ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే ఇద్దరు మనవళ్లు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి కాటికి కాళ్లు చాపుకున్న ఆ వృద్ధులు గుండెలు పగిలేలా రోదించారు. ఇద్దరు కుమారులకు పొగుట్టుకున్న కన్నతల్లి కుమారులను చూసి బోరున విలపించింది. చిన్నారుల మృతితో ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ హృదయ విషాదకర ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది.

ఐదేళ్ల క్రితమే తండ్రి మృతి : వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ జిల్లా బూదవాడ గ్రామానికి చెందిన కందుల భాస్కరరెడ్డి, వెంకటరమణ దంపతులకు మణిశ్రీ రెడ్డి(8), సిద్దారెడ్డి(6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐదేళ్ల క్రితమే కందుల భాస్కరరెడ్డి మృతి చెందాడు. అప్పటి నుంచి వెంకటరమణ బేతపూడిలోని తల్లి వద్దనే నివసిస్తోంది. ఇద్దరు పిల్లలు కూడా అదే గ్రామంలో చదువుకుంటున్నారు. అయితే ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో తాతయ్య (నాన్న తండ్రి) కందుల అంజిరెడ్డి బేతపూడి వెళ్లి ఇద్దరు చిన్నారులను రెండురోజుల క్రితం బూదవాడ గ్రామానికి తీసుకొచ్చాడు.

కృష్ణా జిల్లాలో విషాదం - ఆడుకుంటూ చెరువులో పడి ఏడేళ్ల బాలిక మృతి - seven years old girl died in pond

కుక్కలను చెదరగొట్టే ప్రయత్నం :శుక్రవారం సాయంత్రం ఇద్దరు పిల్లలు ఇంటివద్ద ఆడుకుంటూ అక్కడే అరుస్తున్న కుక్కలను చెదరగొట్టేందుకు వాటి వెంటపడ్డారు. ఈ క్రమంలోనే ఇంటి పక్కనే ఉన్న ఓ నీటి కుంటలో తొలుత సిద్దారెడ్డి పడిపోయాడు. దీన్ని గమనించిన సోదరుడు మణిశ్రీ రెడ్డి తమ్ముడిని బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలోనే మణిశ్రీ రెడ్డి కూడా నీటికుంటలో జారి పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన కుంట వద్దకు చేరుకుని చిన్నారులను బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ఊపిరాడక అక్కడికక్కడే మృతి : కొద్దిసేపటి తరువాత కర్రలతో కుంటలో పడిన చిన్నారులను బయటకు తీశారు. అయితే అప్పటికే ఇద్దరు చిన్నారులు నీళ్లల్లో ఊపిరాడక మృతి చెందారు. అనంతరం మృతదేహాలను ఇంటికి తరలించారు. ఇద్దరు మనవళ్లు మృతి చెందటంతో తాతయ్య-నానమ్మ అంజిరెడ్డి, విజయలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లి వెంకటరమణకు సమాచారం అందించడంతో ఆమె హుటాహుటిన బయలుదేరి వచ్చి విగతజీవులుగా పడి ఉన్న కుమారులను చూసి బోరున విలపించింది.

దీంతో కుటుంబంతో పాటు గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ విషాదకర సన్నివేశం చూపరులను కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారులను కబళించిన క్వారీ- ఈతకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు మృతి

Father and Daughter Died : బతుకు పోరాటంలో తండ్రీ, కూతురు బలి.. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత

ABOUT THE AUTHOR

...view details