Turmeric Load Lorry Hijacked in Nizamabad :పసుపు లోడ్ లారీని దుండగులు హైజాక్ చేయగా పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి రెండు రోజుల కిందట పసుపు లోడ్‌తో బయలుదేరిన లారీ గుంటూరు చేరాల్సింది. అయితే ఇందల్వాయి టోల్‌ప్లాజా సమీపంలో ఓ కారులో వచ్చిన దుండగులు తాము ఆర్టీఏ అధికారులమంటూ ఆ లారీని ఆపేశారు. డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చారు.
స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని కిందకు దించేసి లారీని హైజాక్ చేశారు. లారీలో నిజామాబాద్‌కు వచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో పలు చోట్ల పసుపు విక్రయించారు. తర్వాత నవీపేట మండలంలో జన్నేపల్లికి లారీని తరలించారు. విక్రయించగా మిగిలి ఉన్న పసుపు సంచులను ఇతర వాహనాల్లోకి మార్చి అమ్మాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం ఒక ప్రదేశం నుంచి పసుపు తరలించి విక్రయించానుకున్నారు.
సాయం చేసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - Two Dead in Road Accident
నవీపేటకు చెందిన ఓ వ్యక్తి పసుపు సంచుల కోసం మూడు వాహనాలతో జన్నేపల్లికి వచ్చాడు. తీసుకొచ్చిన వాహనంలో పసుపు సంచులను నింపుతున్నాడు. అయితే ఈ ప్రకియ అంతా స్థానికులు అనుమానంగా చూశారు. దీనిపై పోలీసులకు సమాచారం అందగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. మూడు వాహనాలను డ్రైవర్లను పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :జన్నేపల్లిలో లారీ నుంచి ఇతర వాహనాల్లోకి ఏవో సంచులు తరలిస్తున్నారని మాకు సమాచారం అందింది. స్థానికుల సమాచారం మేరకు మేము వచ్చి చూస్తే పసుపు సంచులను తరలిస్తున్నారు. మమ్మల్ని చూడగానే నిందితులు అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడే ఉన్న డ్రైవర్లను అడిగితే అసలు నిజం బయటకు వచ్చింది. ఈ పసుపు లోడ్ లారీని ఇందల్వాయి టోల్ ప్లాజ్ దగ్గర హైజాక్ చేశారని మాకు చెప్పారు. లారీలో మొత్తం రూ.50 లక్షలు విలువ చేసే లోడ్ ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ ఒకటో ఠాణా పోలీసులు కేసు నమేదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని- ఏం చేశారంటే! - MLA Helps Road Accident Victims