ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల లడ్డూ ధరలు తగ్గాయా? వాస్తవమేంటీ? - ttd clarity on Tirupati Laddu Cost

TTD Clarity on Tirupati Laddu Cost Decrease News: తిరుమలలో లడ్డూ ధరలను తగ్గించారంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలలో కూడా ఎటువంటి మార్పు లేదని పేర్కొంది.

TTD Clarity on Tirupati Laddu Cost
TTD Clarity on Tirupati Laddu Cost (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 5:34 PM IST

Updated : Jun 22, 2024, 5:41 PM IST

TTD Clarity on Tirupati Laddu Cost Decrease News: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని, టీటీడీ ధరలను సవరించిందంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) స్పష్టం చేసింది.

పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలును టీటీడీ సవరించినట్లు వస్తూన్న వార్తలు అవాస్తవమని భక్తులకు గమనించాలని కోరింది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) కొరకు దళారులను సంప్రదించొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

భక్తులకు గుడ్​న్యూస్​ : తిరుమల స్వామివారి కానుకలు ఈ-వేలం - లిస్ట్​లో ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలుసా? - E Auction of Mobile Phones Watches

భక్తులు అంతా దీనిని గమనించాలి: కొన్ని వాట్సప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతుంది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్​సైట్ ద్వారా మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత మేరకు టికెట్ల కేటాయింపు జరిగింది.

భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉందని టీటీడీ తెలిపింది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీల ద్వారా కాకుండా, నేరుగా, రాష్ట్ర టూరిజం వెబ్​సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాబట్టి భక్తులు అంతా దీనిని గమనించాలని కోరింది.

శ్రీవారి భక్తులకు అలర్ట్​ - ఆ ఒక్క రోజు పలు సేవలు రద్దు - టీటీడీ కీలక నిర్ణయం! - TTD Cancelled Some Services

అయితే కొంతమంది దళారులు అమాయకులను టార్గెట్​గా చేసుకుని తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని, దీనకిి ధర ఎక్కువ అవుతుందంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్​లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. అంతేకాకుండా ఇటువంటి దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

మరింత నాణ్యంగా శ్రీవారి లడ్డూ- పోటు కార్మికులతో ఈవో సమావేశం - TTD EO met with the potu workers

Last Updated : Jun 22, 2024, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details