ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు- ఏడుగురు మృతి - road accidents several dead - ROAD ACCIDENTS SEVERAL DEAD

Road Accidents Several Dead: రాష్ట్రంలో వేర్వేరు చోట్లు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Road_Accidents_Several_Dead
Road_Accidents_Several_Dead

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 7:28 AM IST

Updated : Apr 4, 2024, 10:43 AM IST

Road Accidents Several Dead:రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదాల్లో పలువురికి తీవ్ర గాయాలవ్వటంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Visakha Road Accident Several Dead:విశాఖ జిల్లాలోని పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్​ను లారీ ఢీకొట్టటంతో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 10మందికి తీవ్ర గాయాలవ్వటంతో కేజీహెచ్​కు తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలనలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో మృతులను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన హనుమంతు ఆనందరావు(45), హనుమంతు శేఖర్ రావు(15), చింతాడి ఇందు(65)గా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు దగ్గర పొంగనాపల్లి గ్రామంలో వివాహానికి వెళ్లి తిరిగి రాజమండ్రి వెళ్తున్న సమయంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం- తెలుగు విద్యార్థి దుర్మరణం - Telugu Student Dead in America

Road Accident in Paderu:మరోవైపు అల్లూరు జిల్లా పాడేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పాడేరు ఘాట్​రోడ్​లో బుధవారం రాత్రి బొలెరో వాహనం బ్రేకులు ఫెయిల్ అయి 80 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. మరో 27 మంది తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఒడిశాలో పొట్టంగి పంచాయతీ సంబాయ్ సమీప గ్రామానికి చెందిన వలస కూలీలుగా గుర్తించారు.

క్షతగాత్రులు అంబులెన్స్​లో ఆసుపత్రికి చేరగానే బాధితుల రోదన అరణ్య వేదనగా మారింది. ఆసుపత్రిలో వైద్యతర సిబ్బంది, సరిపడా స్ట్రక్చర్స్ లేకపోవడంతో అంబులెన్స్ నుంచి దిగలేక కిందనే కూర్చుండి నరకయాతన అనుభవించారు. ఎక్కడ వాళ్లు అక్కడే కూర్చుని బోరున విలపిస్తున్నారు. మరోవైపు సిబ్బంది ఉన్నప్పటికీ పేషెంట్లు సెలైన్లు చేతులతో పట్టుకున్నారు. ఆస్పత్రిలో ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

Road Accident in krishna district:కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలో తెల్లవారుజామున విషాదఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టటంతో స్కూటీపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఘటనాస్థలిలోనే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతులు చల్లపల్లి మండలం పచ్చర్లంక గ్రామానికి చెందిన దాసరి నాగేశ్వరరావు(70), దాసరి బేబీ సరోజినీ(60)గా గుర్తించారు.

దేవుడి దర్శనానికి వెళ్తుండగా ఆటోను ఢీకొట్టిన ట్రక్కు- ఐదుగురు భక్తులు దుర్మరణం - UP Road Accident

Last Updated : Apr 4, 2024, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details