Tirupati SP Malika Garg Transferred:తిరుపతి ఎస్పీ మలికాగార్గ్‌ను ఏపీ ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. మలికాగార్గ్ స్థానంలో విజయవాడ శాంతిభద్రతల విభాగానికి చెందిన డీసీపీ కృష్ణకాంత్ పటేల్‌ను నియమిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మలికాగార్గ్ తిరుపతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టి కేవలం 20 రోజులు అవుతుంది. ఈ వ్యవధిలోనే, అది కూడా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొద్ది రోజుల ముందు మలికాగార్గ్‌కు స్థానచలనం కలిగించటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికార వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే ఎస్సీని బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
SP Malika Garg: చంద్రబాబు లేఖ దిగ్బ్రాంతికి గురి చేసింది : ప్రకాశం ఎస్పీ
విధుల్లో నిక్కచ్చిగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తే: మలికాగార్గ్ అంతకుముందు ప్రకాశం ఎస్పీగా ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆమె తిరుపతి ఎస్పీగా బదిలీ అయ్యారు. మలికాగార్గ్‌ను తిరుపతి రానివ్వకుండానే బదిలీ చేయించాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి అదే నెల 12న తిరుపతి ఎస్పీగా మలికాగార్గ్ బాధ్యతలు చేపట్టారు. విధుల్లో నిక్కచ్చిగా, తటస్థంగా, చట్ట ప్రకారం వ్యవహరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా పనిచేయొద్దని, నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని సిబ్బందికి ఆమె ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అక్రమాలతో పాటుగా నమోదైన కేసులపై సైతం ఆమె దృష్టి సారించారు. ఆ కేసులను పక్కదారి పట్టించిన వ్యవహారంపై ఆమె ఎన్నికల సంఘానికి ఏదైనా నివేదిక సమర్పిస్తే, సార్వత్రిక ఎన్నికల వేళ తమకు మరింత ఇబ్బందిగా మారుతుందని వైఎస్సార్సీపీ నేతలు భావించి ఆమెను బదిలీ చేపించారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Prakasam District Dalit Woman Case Updates: 'ప్రణాళిక ప్రకారమే దాడి'.. ప్రకాశం జిల్లాలో దళిత మహిళపై దాడి వివరాలను వెల్లడించిన ఎస్పీ