Tirumala Sri Venkateswara Dharmika Sadassu: తిరుమలలో నేటి నుంచి మూడు రోజుల పాటు టీడీపీ వేద సదస్సును నిర్వహిస్తోంది. సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. పీఠాధిపతులు, మాఠాథిపతుల సూచనలు, సలహాలను తీసుకొని హిందూ ధర్మప్రచారం చేయనున్నామని అధికారులు తెలిపారు. దీని ద్వారా శ్రీవారి వైభవాన్ని, హైందవ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తి చేసేందుకు తిరుమలను ఓ మంచివేదిక కాబోతుందని వారు పేర్కొన్నారు .
సరిగా 16 సంవత్సరాల క్రితం హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో ఇలాంటి వేదికలు నిర్వహించి అనేక కార్యక్రమాలకు నాంది పలికింది. హైందవ సంస్కృతిపై పట్టు ఉన్న పీఠాధిపతుల సూచనల మేరకు తితిదే కార్యక్రమాలను చేపట్టింది. వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో భక్తుల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం తిరుమల ఆస్థాన మండపంలో నేటి నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్నవయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు విచ్చేశారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఫిబ్రవరి 16న పలు సేవలు రద్దు! పూర్తి వివరాలివే!
హిందూ ధర్మప్రచారాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు: మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. భారతదేశం పవిత్ర భూమి అని, ఇక్కడే వేదాలు ఆవిర్భవించాయని, సాక్షాత్తు విష్ణుమూర్తి వారు శ్రీరామ, శ్రీకృష్ణ రూపాల్లో అవతరించారని చెప్పారు. ఈ దేశంలోనే ధర్మాచరణకు దిక్సూచిగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా అవతరించారని అన్నారు.
సూచనలు, సలహాలను స్వీకరిస్తాం: స్వామివారి ఆశీస్సులతో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుంచి సముచితమైన సూచనలను, సలహాలను స్వీకరిస్తామన్నారు. తాను తొలిసారి ఛైర్మన్గా ఉన్న సమయంలో రెండు సార్లు ధార్మిక సదస్సులు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, మత్స్య గోవిందం, గిరిజన గోవిందం లాంటి కార్యక్రమాల ద్వారా భగవంతుడిని భక్తుల చెంతకు తీసుకెళ్లామని చెప్పారు.
హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మరింతగా హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్నవయసు నుంచే పిల్లల్లో మానవతా విలువలను పెంచేందుకు తితిదే అనేక చర్యలు చేపడుతోందన్నారు. ఇప్పటివరకు 57 మంది పీఠాధిపతులు సదస్సుకు విచ్చేసేందుకు సమ్మతి తెలియజేసినట్టు చెప్పారు. శ్రీవారి ఆలయం నుంచి ఏ సందేశం వెళ్లినా భక్తులందరూ ఆమోదించి ఆచరిస్తారని ఛైర్మన్ తెలిపారు.
టీటీడీ పాలక మండలి సమావేశం - కీలక నిర్ణయాలు ఇవే