Tirumala Brahmotsavam Schedule:ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనార్థం తరలి వస్తుంటారు. ఏడాది పొడవునా ఆలయం గోవింద నామాలతో మార్మోగుతుంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే దారులన్నీ తిరుమల వైపే పరుగులు తీస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో వేర్వేరు రథాలపై తిరుమల మాఢ వీధుల్లో తిరిగే స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోయి అంతులేని అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే తిరుమల శ్రీవారిని సేవించుకునేందుకు ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు చెబుతుంటారు. అంతటి విశిష్టత కలిగిన తిరుమల వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది బ్రహ్సోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్:
- అక్టోబర్ 3వ తేదీ గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన
అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం- మొదటిరోజు:
- మధ్యాహ్నం: 3.30 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం
- సాయంత్రం: సుమారు 6 గంటలకు ద్వజారోహణం (ధ్వజారోహణం)
- రాత్రి: 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం
అక్టోబర్ 5వ తేదీ శనివారం- రెండోరోజు:
- ఉదయం: 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన శేష వాహనం
- మధ్యాహ్నం: ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం(ఉత్సవర్లకు అభిషేకం)
- రాత్రి: 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనం
అక్టోబర్ 6వ తేదీ ఆదివారం- మూడోరోజు:
- ఉదయం: 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహవాహనం
- మధ్యాహ్నం: ఒంటి గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం)
- రాత్రి: 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యాల పల్లకీ వాహనం (ముత్యపు పందిరి వాహనం)
అక్టోబర్ 7వ తేదీ సోమవారం- నాల్గవ రోజు:
- ఉదయం: 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం
- సాయంత్రం: 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం