ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదలకు ఇళ్ల స్థలాలు - అక్కడ జీ ప్లస్ 3 ఇళ్లు' : కూటమి ప్రభుత్వం నిర్ణయం - HOUSES AND PLOTS TO THE POOR

ఇళ్ల పట్టాల పంపిణీకి కూటమి ప్రభుత్వం సన్నాహాలు - క్యాబినెట్ కమిటీ నిర్ణయం

hose_lands_for_poor_people
hose_lands_for_poor_people (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2025, 3:12 PM IST

HOSE LANDS FOR POOR PEOPLE :కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ఏ క్షణాన్నయినా ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఉగాది నుంచి పట్టాలు చేతికందనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో 'పేదలకు ఇళ్ల పట్టాలు' అనే ఎన్నికల హామీ అమలు దిశగా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. భూమి లభ్యత లేని పట్టణ ప్రాంతాల్లో జీ+3 విధానంలో టిడ్కో గృహాలు నిర్మిద్దామని సీఎం స్పష్టం చేశారు. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. పట్టణాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రస్తుతం 100 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తుండగా దాన్ని 150 గజాలకు పెంచాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదనంగా 150-300 గజాల వరకు రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో కొంత వెసులుబాటు ఇవ్వాలని మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది.

వైసీపీ పెద్దల లాభం కోసమే జగనన్న కాలనీలు : మంత్రి నాదెండ్ల మనోహర్ - problems of Jagananna colonies

అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు 2025 డిసెంబర్ 31 వరకూ పొడిగించడంతో పాటు అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో 2019 అక్టోబర్ 15 వరకూ నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక అందరికీ ఇళ్ల పథకం కింద పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు సెంటు స్థలంలో ఇల్లు కట్టి ఇచ్చేలా ప్లాన్ చేయడం విదితమే. అయితే, సెంటు స్థలం ఇంటి నిర్మాణానికి ఏ మాత్రం సరిపోదని, గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

త్వరలో మార్గదర్శకాలు

ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనుంది. స్థలాల కేటాయింపులో బీపీఎల్ రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వారి తర్వాత పేదలకు స్థలాలు మంజూరు చేయనున్నారు. తెలుగు సంవత్సరం ఉగాది నుంచి ఇళ్ల పట్టాల మంజూరు ప్రారంభించి నిరంతరం కొనసాగించే అవకాశాలున్నాయి.

అర్హతలు ఇవేనా?!

  • గతంలో ఇల్లు లేదా స్థలం పొందిన వారిని తిరిగి పరిగణలోకి తీసుకోవద్దని కేబినెట్ కమిటీ నిర్ణయించింది.
  • స్థలానికి దరఖాస్తు చేసే లబ్ధిదారుడు కచ్చితంగా రాష్ట్రానికి చెందిన వారై స్థానిక ఆధార్ కలిగి ఉండాలి.
  • గతంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లే అవుట్లను రద్దు చేసి కొత్తగా లే అవుట్లు ప్రభుత్వం ఖరారు చేయనుంది.
  • పాత లే అవుట్లలో ఇల్లు కట్టుకోని వారి నుంచి స్థలం తీసుకొని తిరిగి వేరే ప్రాంతంలో కేటాయించే వీలుంది.
  • సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తారు.

ఇళ్లు, పట్టాలు ఇచ్చేశామని వైసీపీ నేతల ఫేక్ పబ్లిసిటీ- ఎక్కడ ఇచ్చారో చూపాలని మహిళల ఆగ్రహం

వరద ముంపు తప్పినా పొంచి ఉన్న సర్కారు ముప్పు - పట్టాలు అందక కూల్చివేత భయం

ABOUT THE AUTHOR

...view details