AP Man Invents Piracy Secured Board: ప్రస్తుత రోజుల్లో థియేటర్లలో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే వెంటనే దాని పైరసీ కాపీ పలు వెబ్‌సైట్లలో దర్శనమిస్తోంది. తద్వారా కోట్ల రూపాయల వెచ్చింది సినిమాలు తెరకెక్కించిన నిర్మాతలకు నష్టం వాటిల్లుతోంది. పైరసీని ఎలా అయినా అడ్డుకునేందుకు సినీ నిర్మాతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే దీనిని దీన్ని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పి.వినోద్‌కుమార్ అనే వ్యక్తి ఓ ప్రత్యేక బోర్డును తయారు చేశారు. దాని పేరే పైరసీ సెక్యూర్డ్ బోర్డ్. దీనికి తాజాగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా పేటెంట్ సైతం ఇచ్చింది.
ఇక వీడియో రికార్డు అవ్వదు: గతంలో యూఎస్‌లోని ఫాక్స్ స్టూడియోస్ పైరసీని నియంత్రించేందుకు వాటర్‌మార్క్ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఇంతకీ ఈ వాటర్‌మార్క్ టెక్నాలజీ ఏంటంటే, సినిమా జరుగుతున్న సమయంలో కొన్ని క్షణాలపాటు ఒక నెంబర్ వచ్చి వెళ్తుంది. తద్వారా పైరసీ కాపీలో రికార్టు అయ్యే ఆ నంబరు ఆధారంగా ఆ మూవీని ఎక్కడ కాపీ చేశారు. ఏ రోజు రికార్డు చేశారో ఈజీగా గుర్తించొచ్చు. అయితే ఇలా గుర్తించినా కూడా ఇంకా ఏమీ చేయలేకపోతున్నారని తెలుసుకున్న వినోద్‌కుమార్ పైరసీని అరికట్టేందుకు సరికొత్త బోర్డుని రూపొందించారు.