Srisailam to Somasila Tourism Package :నల్లమల అటవీ ప్రాంతం, కొండకోనల మధ్య కృష్ణా నదిలో విహారానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు అక్టోబర్ 26 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో ఒకేసారి 120 మంది ప్రయాణించేలా డబుల్ డెక్కర్ తరహాలో ఏసీ లాంచీని సిద్ధం చేసింది.
కృష్ణా నదిలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు (120 కిలోమీటర్లు) 7 గంటల పాటు లాంచీ ప్రయాణం ఉంటుంది. ఈ లాంచీ ప్రయాణానికి పెద్దలకు 2 వేల రూపాయలు, పిల్లలకు 1,600 రూపాయల టికెట్ ధర నిర్ణయించినట్లు సోమశిల లాంచీ ఇన్‌ఛార్జి శివకృష్ణ తెలిపారు.