తెలంగాణ

telangana

ETV Bharat / state

అమెరికాలో హనుమకొండ విద్యార్థి అనుమానాస్పద మృతి - పార్క్ చేసి ఉన్న కారులో మృతదేహం - TELANGANA STUDENT DIED IN US

అమెరికాలో హనుమకొండ జిల్లాకు చెందిన విద్యార్థి అనుమానాస్పద మృతి - అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పార్కింగ్‌ చేసిన ఓ కారులో మృతదేహం గుర్తింపు - కుటుంబసభ్యులకు సమాచారం అందించిన అదే అపార్ట్​మెంట్​లో ఉంటున్న హనుమకొండ యువకులు

TELANGANA STUDENT DIED IN AMERICA
Telangana student Suspicious Death in USA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

Telangana student Suspicious Death in USA :అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం హనుమకొండ జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండి రాజయ్య, లలితల రెండో కుమారుడు వంశీ (25) 2023 జులైలో అమెరికాలోని మిన్నెసొటాకు వెళ్లారు. అక్కడే ఎంఎస్‌ చదువుతూ, ఇటీవలే పార్ట్​టైం ఉద్యోగంలో చేరారు.

పార్కింగ్‌ చేసిన ఓ కారులో మృతి చెందినట్లు సమాచారం : వంశీ ఉంటున్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పార్కింగ్‌ చేసిన ఓ కారులో మృతి చెంది ఉన్నట్లు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న హనుమకొండ జిల్లాకు చెందిన కొందరు యువకులు ఆదివారం రాత్రి 9.30 గంటలకు గుర్తించారు. దీంతో వెంటనే వంశీ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వంశీ మరణ వార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. వారిని హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జీ వొడితల ప్రణవ్‌ పరామర్శించగా, వంశీ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details