Ban on Mayonnaise in Telangana : కలుషిత ఆహారం కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ వెజ్ వంటకాలతో పాటు వడ్డించే మయోనైజ్‌పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సుదీర్ఘ సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకోగా త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి.
మండి బిర్యానీలో అదే ఫేమస్ - ఆ వంటకాన్ని బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్‌లో పెరుగుతున్న కలుషిత ఆహారం కేసులు - రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం
ban_on_mayonnaise_in_telangana (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా మయోనైజ్ వాడినట్లు తెలిసింది. అడపాదడపా పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మీరు మండి బిర్యానీ ప్రియులా? - ఆ చట్నీ నిషేధానికి ఆహార కల్తీ నియంత్రణ విభాగం సిఫార్సు