Telangana SSC Hall tickets 2024 :పదోతరగతి పరీక్షల హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసింది. హాల్టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్(bse.telangana.gov.in) లేక పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థులు హాల్ టిక్కెట్లు పొందవచ్చునని ప్రకటించింది. ఇప్పటికే హాల్ టికెట్లను అన్ని పాఠశాలలకు అందజేసినట్టు పేర్కొంది.
హాల్ టిక్కెట్లలో మీడియం లేదా సబ్జెక్ట్ కోడ్‌లకు సంబంధించి ఏవైనా సవరణలు గమనించినట్లయితే సంబంధిత హెడ్ మాస్టర్లు వెంటనే తెలియజేయాని స్ఫష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు జరనున్నట్లు తెలిపింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే సైన్స్ విషయంలో రెండు భాగాలుగా పరీక్ష జరగనున్న నేపథ్యంలో పార్ట్ 1 ఫిజికల్ సైన్స్, పార్ట్ 2 బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహించనున్నట్టు వివరించింది.
Telangana Tenth Class Halltickets 2024 : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు(SSC Hall tickets 2024) మొత్తం 5 లక్షల 8 వేల 385 మంది విద్యార్థులు హాజరవుతుండగా, వారిలో 2 లక్షల 57 వేల 952 మంది బాలురు, 2 లక్షల 50 వేల 433 మంది బాలికలు ఉన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 వేల 676 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనుండగా విద్యార్థులు, సిబ్బంది పరీక్షా కేంద్రాలలోనికి మెబైల్ ఫోన్లు, ఎలక్ట్రానికి పరికరాలను తీసుకువెళ్లరాదని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ స్ఫష్టం చేసింది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏమైనా సందేహలు అనుమానాలు ఉంటే అవసరమైన సమాచారానికి హైదరాబాద్లోని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన 040-23230942 నెంబర్కి కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల డెరెక్టరేట్ కోరింది.