తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం - సుమోటోగా స్వీకరించిన హైకోర్టు - High Court on Phone Tapping Case - HIGH COURT ON PHONE TAPPING CASE

HC on Phone Tapping Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. పలు వార్తా పత్రికల్లో వరుస కథనాలు రావడంతో ఈ మేరకు స్పందించింది. గతంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ను సైతం ట్యాప్‌ చేసినట్లు భుజంగరావు అంగీకరించినట్లు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. వాటిని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ అలోక్‌ అరాధే ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. కాగా మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది.

Telangana High Court on Phone Tapping Case
HC on Phone Tapping case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 10:27 PM IST

Updated : Jun 3, 2024, 10:42 PM IST

Telangana High Court on Phone Tapping Case : గత బీఆర్ఎస్ సర్కార్ రాజకీయ ప్రత్యర్థులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందించింది. ఈ కథనాలను పరిశీలించిన హైకోర్టు సుమోటో పిటిషన్​గా స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ టీ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీలో పనిచేసిన ఏఏస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్​ను విమర్శించే ప్రతి రాజకీయ నాయకులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు వెల్లడించినట్లు కథనాలు వెలువడ్డాయి.

Phone Tapping Case Update :ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు సూచనలతో మేకల తిరుపతన్న, డి.ప్రణీత్అవు, టాస్క్​ఫోర్సు మాజీ డీసీపీ జీ రాధాకిషన్​లు, ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఉగ్రవాదుల ఆచూకీ నిమిత్తం వినియోగించే పరికరాల సాయంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి నాటి ప్రతిపక్ష నేతలు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతోపాటు న్యాయమూర్తుల వ్యక్తిగత జీవితాల గురించి వివరాలు సేకరిస్తారని భుజంగరావు వెల్లడించినట్లు పేర్కొన్నాయి.

వీరితోపాటు విద్యార్థినేతలు, ప్రతిపక్ష నేతల కుటుంబాలు, జర్నలిస్టులపై నిఘా ఉంటుందని పేర్కొన్నాయి. దుబ్బాక, హుజూర్​నగర్, మునుగోడు ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దీన్ని ఉపయోగించినట్లు గులాబీ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి తామంతా కృషి చేసినట్లు భుజంగరావు పేర్కొన్నారని, బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో ప్రముఖ కంపెనీలు, వ్యక్తులకు చెందిన సివిల్ వివాదాలను సెటిల్ చేసినట్లు కథనాలు వచ్చాయి.

రేపు మధ్యాహ్నం విచారించనున్న సీజే ధర్మాసనం :ఎన్నికల ప్రచారం సమయంలో పలు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు నేతల డబ్బులను సైతం ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నట్లు భుజంగరావు చెప్పినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. భుజంగారావు, ప్రణీత్​రావు, తిరుపతన్న వాంగ్మూలాల ఆధారంగా పలు కథనాలు వచ్చాయి. పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలించిన హైకోర్టు ఈ అంశాన్ని సుమోటో పిటిషన్​గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై మంగళవారం మధ్యాహ్నం సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లూ ట్యాపింగ్​ - పర్సనల్ డేటా సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర - JUDGES PHONE TAPPING IN TELANGANA

ప్రతిపక్ష నేతల డబ్బులపై ప్రత్యేక నిఘా - దాడుల కోసం తిరుపతన్న ప్రత్యేక టీమ్‌ - Tirupatanna ON PHONE TAPPING

Last Updated : Jun 3, 2024, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details