ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"గుడ్​ టచ్, బ్యాడ్ టచ్" - బయటపడిన ఉపాధ్యాయుల బాగోతం - GOOD TOUCH BAD TOUCH

అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు - గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహనతో తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థినులు

Teacher Suspended Due to Misbehaving on School Girls
Teacher Suspended Due to Misbehaving on School Girls (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2024, 1:01 PM IST

Updated : Nov 28, 2024, 1:08 PM IST

Teacher Suspended Due to Misbehaving on School Girls : గురువు అంటే తండ్రిలాంటివాడు. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. కానీ, కొందరు గాడి తప్పుతున్నారు. విద్యార్థినులపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అభం, శుభం ఎరుగని పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించే పేరిట వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. తాజాగా పాఠాలు చెప్పాల్సిన గురువే పాడు పని చేశాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్​కి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.

విద్యార్థినులతో అసభ్యంగా : ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కోమటినేనివారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు పదో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన ఉన్న విద్యార్థినిలు ఈ విషయాన్ని మహిళా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఉప విద్యాశాఖ అధికారి వేణుగోపాలరావును డీఈవో చంద్రకళ ఆదేశించారు. ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని తేలడంతో సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థినులకు 'గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌' పాఠం - బట్టబయలైన ఉపాధ్యాయుడి వక్రబుద్ధి

'గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌' :ఇలాంటి ఘటనే కొద్దిరోజుల క్రితం కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది.కాకినాడలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌'పై వన్‌టౌన్‌ మహిళా పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆరో తరగతి విద్యార్థినులు కొంతమంది సదస్సుకు వచ్చిన మహిళా పోలీసు వద్దకు వచ్చి 'అక్కా లెక్కల మాస్టారు శ్రీనివాసరావు మాపై చేతులు వేసి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు' అని చెప్పారు. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులకు తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు కొట్టుకుంటూ : ఆ సమయంలో ఇంటివద్ద ఉన్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విద్యార్థినుల తల్లిదండ్రులు కొట్టుకుంటూ పాఠశాలకు తీసుకెళ్లారు. ఎంఈఓ వారిని అడ్డుకునేందుకు యత్నించినా వదల్లేదు. వన్‌టౌన్‌ సీఐ వచ్చి టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయినా తమకు అప్పగించాల్సిందేనని తల్లిదండ్రులు, బంధువులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని సీఐ చెప్పడంతో చివరికి అడ్డుతొలిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు.

విద్యాకానుక లెక్కలతో బట్టబయలైన ప్రభుత్వ బాగోతం - పిల్లల సంఖ్య పడిపోయినా వెల్లడించని సర్కారు - Govt Schools Fallen Drastically

ఏది గుడ్‌ టచ్‌, ఏదీ బ్యాడ్‌ టచ్‌ - పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సింది మీరే! ఇవిగో కొన్ని చిట్కాలు - Good Touch Bad Touch Instructions

Last Updated : Nov 28, 2024, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details