Teacher Sleeps in Haunted Classroom : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆనంద్‌పూర్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో బలంగా గాలి వీచినా విద్యార్థులకు భయమే. చెట్టుకొమ్మల చప్పుడు వినిపిస్తే చాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. సాయంత్రమవుతుందంటే చాలు, అయిదో తరగతి గది వైపు కన్నెత్తి చూడాలంటే విద్యార్థుల వెన్నులో వణుకు. ఎందుకంటే ఆ పాఠశాలలో దయ్యం తిరుగుతోందని విద్యార్థుల భయం. అది ఐదోతరగతిలోనే నివాసం ఉంటోదని వారి అపనమ్మకం.
విద్యార్థుల్లో భయం :రవీందర్‌రెడ్డి అనే ఉపాధ్యాయుడు జులై రెండున అక్కడికి బదిలీపై వెళ్లారు. అదేరోజు ఏడో తరగతిలో పాఠం బోధిస్తుండగా, ఓ శబ్ధం వినిపించటంతో వెనక బెంచీల్లో కూర్చున్న విద్యార్థలంతా ఒక్క పరుగున ముందుకు పరుగెత్తుకొచ్చారు. దీంతో ఉపాధ్యాయుడు ఎవమయిందని ఆరాతీస్తే, అయిదో తరగతి గదిలో దెయ్యం ఉందని విద్యార్థులు భయం భయంగా చెప్పారు. ఉపాధ్యాయుడు దయ్యాల్లేవని ఎంత చెప్పిన విద్యార్థులు నమ్మలేదు.
నిద్రపోయిన ఉపాధ్యాయుడు : మరి ఏంచేస్తే నమ్ముతారంటే, అమావాస్య రోజున ఒక్కరే నిద్రపోతే నమ్ముతామని విద్యార్థులు చెప్పారు. దీంతో జులై అయిదో తేదీన అమావాస్య రోజున రవీందర్‌రెడ్డి ఒక్కరే నిద్రపోయి విద్యార్థుల్లో ఉన్న అపనమ్మకాన్ని పటాపంచలు చేశారు. అమావాస్య రోజున రవీందర్‌రెడ్డి ఒక్కరే పాఠశాలలో నిదురపోవటం, తెల్లారాక ఆయనకు ఏమీ కాకపోవడంతో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం వచ్చింది.