Darshi TDP MLA candidate Dr Gottipati Lakshmi: ఆమె వృత్తి రిత్యా వైద్యురాలు, వైద్య వృత్తి ద్వారా సేవలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా, ప్రజలకు మరింత దగ్గర అవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేయడానికి సిద్దమయ్యారు. ఆ పార్టీ సైతం ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇప్పటికే ఎన్నికల సమరం మెుదలవడంతో ఇంటింట ప్రచారం ప్రారంభించారా డాక్డర్. ఈ నేపథ్యంలో ప్రచారంలో బిజీగా ఉన్నా, తన వృత్తి ధర్మాన్ని మాత్రం వీడలేదు. ఓ నిండు గర్భిణీ ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి, ఆసుపత్రికి వెళ్లి గర్భిణీకి ప్రసవం చేసిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రచారంలో ఉన్నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు ఆ అభ్యర్థి, అత్యవసరంగా సీజరిన ఆపరేషన్ చేయాల్సి వచ్చినా అందుబాటులో గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల ఆందోళన చెందుతున్న ఓ గర్భిణీ కి తామున్నామంటూ ముందుకొచ్చి మానవత్వం చాటి చెప్పారు ఆమె ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి దర్శి ప్రాంతంలో ప్రచారంలో ఉన్నారు. అదే సమయంలో కురిచేడు మండలం, అబ్బాయి పాలెం గ్రామానికి చెందిన దర్శి వెంకటరమణ అనే గర్భిణీకి అత్యవసర ఆపరేషన్ చేయవలిసి రావటంతో డాక్టర్.గొట్టిపాటి లక్ష్మీ గారిని పెషేంట్ బందువులు సంప్రదించారు.
వామ్మో ప్రెస్ మీట్ లా - యూట్యూబర్లతో బెంబేలెత్తుతున్న రాజకీయ నాయకులు.! - YouTube channels