ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని సుప్రీం ఆదేశం - వెంటనే జస్టిస్‌ నరసింహారెడ్డి రాజీనామా - SUPREME COURT ON KCR PETITION - SUPREME COURT ON KCR PETITION

Supreme Court orders to change Justice Narasimha Reddy : తెలంగాణ విద్యుత్​ ఒప్పందాలపై విచారణ కమిషన్​ ఛైర్మన్ పదవి నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. ఆయనను మార్చాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు రావటంతో, వెంటనే విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్‌ నరసింహారెడ్డి లేఖ రాశారు.

Change the Chairman of Electricity Inquiry Commission Supreme Court Order
Change the Chairman of Electricity Inquiry Commission Supreme Court Order (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 2:19 PM IST

Updated : Jul 16, 2024, 7:38 PM IST

Justice Narasimha Reddy Dropped out From Electricity Commission: తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై జరుగుతున్న విచారణ కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్ ఎల్‌. నరసింహారెడ్డి తప్పుకున్నారు. విచారణ కమిషన్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన లేఖ రాశారు. భోజన విరామ సమయంలో న్యాయవాది ద్వారా, కోర్టుకు తన లేఖ పంపారు.

లేఖను న్యాయవాదులు, సుప్రీంకోర్టుకు అందించారు. జస్టిస్‌ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించి ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారమే కమిషన్‌ విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. వచ్చే సోమవారంలోపు నూతన ఛైర్మన్‌ను నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుధీర్ఘవాదనలు జరిగాయి.

కక్ష సాధింపు ధోరణితోనే జ్యుడీషియల్​ విచారణ : రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే జ్యుడీషియల్​ విచారణ జరుపుతున్నారని కేసీఆర్​ తరఫు లాయర్​ వాదనలు మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్​ కొనుగోలు చేయాల్సి వచ్చిందని సీజేఐ ధర్మాసనానికి చెప్పారు. ఎన్నికలకు ముందే ప్రస్తుత సీఎం ఆర్​టీఐ ద్వారా అనేక సమాచారాలు సేకరించి పెట్టుకున్నారని తెలిపారు. వాటి ఆధారంగా ముందస్తు ఆలోచనతోనే కక్షసాధింపు ధోరణితో ఇప్పుడు కమిషన్​ వేశారన్నారు.

CJI Bench Objected to Justice Narasimha Press Meet :విచారణ జరుపుతున్న కమిషన్‌ ఛైర్మన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారని, కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రెస్‌మీట్‌పై సీజేఐ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తంచేసింది. కమిషన్ ఛైర్మన్‌ ప్రెస్‌మీట్‌లో, అభిప్రాయాలు వ్యక్తపర్చడం సరికాదని పేర్కొంది. విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని ఆదేశించింది.

కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చేందుకు, తెలంగాణ సర్కార్‌ అంగీకరించింది. మధ్యాహ్నం మరో పేరును వెల్లడిస్తామని, తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభిషేక్‌ మనుసింఘ్వీ, సిద్ధార్థ్‌ లూథ్రా తెలిపారు. ఈలోపే జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, కమిషన్‌ ఛైర్మన్‌గా తప్పుకుంటూ లేఖ రాశారు. కొత్త ఛైర్మన్‌ను నియమించి విచారణ కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. సోమవారం లోపు నూతన ఛైర్మన్‌ను నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. తర్వాత కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు.

Ex Minister Prashanth Reddy Welcomes Supreme verdict : విద్యుత్‌ విచారణ కమిషన్‌పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ధర్మాసనం వ్యాఖ్యలు రేవంత్‌ ప్రభుత్వానికి చెంపపెట్టని వ్యాఖ్యానించారు. విచారణ పేరిట కేసీఆర్‌ను బదనాం చేయాలన్న కుట్ర జరుగుతుందని పునరుద్ఘాటించారు. సీజేఐ వ్యాఖ్యలు తమ వాదనకు బలం చేకూరుస్తున్నాయని అన్నారు. మంచి పనులు చేసినా బురదజల్లాలన్నదే కాంగ్రెస్‌ ఉద్దేశమని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి దుర్బుద్ధి రాజకీయాలు మానాలని ప్రశాంత్‌రెడ్డి కోరారు.

హైకోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​కు షాక్ - పిటిషన్ కొట్టివేసిన సీజే ధర్మాసనం - TELANGANA HC DISMISSED KCR PETITION

విద్యుత్​ కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్​కు నోటీసులు - సమయం కోరిన మాజీ సీఎం - KCR SUMMONED IN POWER PURCHASE DEAL

Last Updated : Jul 16, 2024, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details