ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు కళాశాలలో విద్యార్థులు ర్యాగింగ్ - ఊతకర్రలతో కొడుతూ వీడియోలు - Students Ragging in Boys Hostel

Students Ragging in Boys Hostel at Narasaraopet: నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాల బాలుర హాస్టల్‌లో ర్యాగింగ్‌ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను సీనియర్లు విద్యార్థులు ర్యాగింగ్ చేసి దారుణంగా హింసించి పైశాచిక ఆనందం పొందారు. ఘటనకు సంబంధించి ఓ వీడియో దృశ్యం సామాజిక మాధ్యమంలో వైరల్​గా మారడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

students_ragging_in_hostel
students_ragging_in_hostel (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 5:03 PM IST

Updated : Jul 24, 2024, 6:48 PM IST

Students Ragging in Boys Hostel at Narasaraopet:జూనియర్ విద్యార్థులను సీనియర్​ విద్యార్థులు ర్యాగింగ్ చేసి దారుణంగా హింసించి పైశాచిక ఆనందం పొందిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ర్యాగింగ్​కు సంబంధించిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాల బాయ్స్ హాస్టల్​లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. సీనియర్​ విద్యార్థులు జూనియర్లును ఊతకర్రతో చితకబాది పైశాచిక ఆనందం పొందారు. ఘటనకు సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్​గా మారింది.

వీడియో వైరల్​గా మారడంతో నరసరావుపేట ఒకటో పట్టణ సీఐ, పోలీసు సిబ్బంది కళాశాల హాస్టల్​కు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. వీడియోలో సీనియర్ విద్యార్ధుల చేతుల్లో దెబ్బలు తిన్న జూనియర్ విద్యార్థులను పిలిచి సీఐ చింతల కృష్ణారెడ్డి విచారించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఘటన జరిగినట్లు విచారణలో తేలిందని ఒకటో పట్టణ సీఐ చింతల కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఘటనకు పాల్పడ్డ సీనియర్ విద్యార్ధులు పాస్ అయ్యి హాస్టల్ నుంచి వెళ్లిపోయినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు - సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు - Madanapalle One Town CI Sent to VR

ఘటనకు పాల్పడ్డ విద్యార్థులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట సీఐ అన్నారు. అనంతరం నరసరావుపేట సీపీఐ నాయకుడు కాసా రాంబాబు, ఏఐఎస్ఎఫ్ సంఘ నాయకులు కళాశాల బాయ్స్ హాస్టల్​కు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. ఘటనకు సంబంధించి ర్యాగింగ్​కు పాల్పడ్డ సీనియర్ విద్యార్ధుల తీరును ఖండించారు. కళాశాల హాస్టల్లో జరుగుతున్న పైశాచిక కార్యక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకుడు కాసా రాంబాబు, ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.

శిథిలావస్థలో పాఠశాల భవనాలు - కొత్తవి నిర్మించాలని విద్యార్థుల మొర - Dilapidated School Buildings

లంకలను ముంచెత్తిన వరద గోదారి - బిక్కుబిక్కుమంటున్న కోనసీమ వాసులు - Godavari Floods in Lanka Villages

Last Updated : Jul 24, 2024, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details