Students protest at Kurnool Medical College:కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులు నిరసనకు దిగారు. తమకు న్యాయం దక్కే వరకు నిరసిస్తూనే ఉంటామనే రీతిలో తమ వ్యతిరేకతను విద్యార్థులంతా వ్యక్తపరిచారు. ఇంతకీ కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు ఈ విధంగా ఎందుకు నిరసన చేయాల్సొచ్చింది? అసలేం జరిగి ఉంటుంది? దాని పర్యవసానాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం.!
కేటగిరీలుగా ఎంబీబీఎస్ సీట్ల విక్రయంపై వైద్య విద్యార్థుల అభ్యంతరం..
కళాశాలకు చెందిన భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో: కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఈ ఆవరణలో దుకాణాలను నెలకొల్పేందుకు ఎటువంటి అనుమతులు లేకుండా కేటాయించుకున్నారు. తమ కళాశాలకు చెందిన భూమిని ఈ విధంగా లాక్కోవడాన్ని నిరసించిన మెడికల్ కళాశాల విద్యార్థులు నిరసనకు దిగారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.